బీఆర్‌ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 119 స్థానాలకు గానూ 115 స్థానాలకు అభ్యర్థుల జాబితాను సోమవారం ప్రకటించారు. ఈ ఏడాది చివర్లో జరగనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ గజ్వేల్, కామారెడ్డి నియోజకవర్గాల నుంచి పోటీ చేయనున్నారు. అంతేకాకుండా.. అక్టోబర్ 16న పార్టీ తన మేనిఫెస్టోను వరంగల్‌లో నిర్వహించే ర్యాలీలో విడుదల చేస్తుందని కేసీఆర్ వెల్లడించారు. అయితే.. బోథ్, ఖానాపూర్, వైరా, కోరుట్ల, ఉప్పల్, ఆసిఫాబాద్, వేములవాడ నియోజకవర్గాల అభ్యర్థుల విషయంలో ఏడు మార్పులు చేర్పులు చేసినట్లు ఆయన తెలిపారు. నాంపల్లి, నర్సాపూర్, గోషామహల్, జనగాం నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల్లో అభ్యర్థిత్వాన్ని పెండింగ్‌లో ఉంచిన కేసీఆర్.. తర్వాత ప్రకటిస్తానని వెల్లడించారు.
Also Read : Ind Vs Pak: ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్ కు ఆ స్టార్ బ్యాటర్ దూరం..!
అయితే.. ఈ సందర్భంగా నర్సాపూర్ ఎమ్మెల్యే చిలుముల మదన్ రెడ్డి మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్ నాకు అన్యాయం చేయడని ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాకుండా.. సీఎం కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకున్న దానికి కట్టుబడి ఉంటానని ఆయన వెల్లడించారు. కేసీఆర్ బావిలో దూకమంంటే దూకుతానని ఆయన వెల్లడించారు. కార్యకర్తలు కూడా సంయమనం పాటించాలని ఆయన అన్నారు.
Also Read : Keerthi Bhat: హీరోతో ‘కార్తీక దీపం’ హీరోయిన్ ఎంగేజ్ మెంట్.. ఫొటోస్ వైరల్
తెలుగుదేశం పార్టీతో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన మదన్ రెడ్డి, 2004లో ఆ పార్టీ తరపున నర్సాపూర్ శాసనసభ నియోజకవర్గం నుండి పోటీచేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వాకిటి సునీతా లక్ష్మారెడ్డిపై చేతిలో 25817 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఆ తరువాత టీఆర్ఎస్ పార్టీలో చేరాడు. 2014లో జరిగిన తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ పై నర్సాపూర్ శాసనసభ నియోజకవర్గం నుండి పోటీచేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వాకిటి సునీతా లక్ష్మారెడ్డిపై 14,217 ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు.
2018 లో జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ టికెట్ పై నర్సాపూర్ శాసనసభ నియోజకవర్గం పోటీచేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వాకిటి సునీతా లక్ష్మారెడ్డిపై 38,120 ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు. రెండుసార్లు ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఇరిగేషన్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్ డైరెక్టర్ గా, ఒకసారి మెదక్ జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ గా పనిచేశారు మదన్ రెడ్డి.
