NTV Telugu Site icon

MLA Laxma Reddy : మత రాజకీయాలు మాకొద్దు.. బీఆర్‌ఎస్‌లో చేరిన బీజేపీ నాయకులు

Laxma Reddy

Laxma Reddy

తెలంగాణలో రాజకీయలు వేడెక్కుతున్నాయి. ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘం తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్‌ విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే.. ఈ నేపథ్యంలో ఆయా పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించేందుకు కృషి చేస్తున్నారు. దీంతో కొన్ని పార్టీల్లోని కార్యకర్తలు, ముఖ్య నేతలు ఇతర పార్టీలకు జంప్‌ చేస్తున్నారు. అయితే.. మత రాజకీయాలు మాకొద్దంటూ జడ్చర్ల మున్సిపాలిటీలోని 1వ వార్డు బీజేపీ ప్రెసిడెంట్ సహా 40 మంది నాయకులు బీఆర్ఎస్‌లో చేరారు. అయితే.. వారిని కండువా కప్పి ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ఆహ్వానించారు.

Also Read : OnePlus Open: వన్‌ప్లస్ ఓపెన్ ఫోల్డబుల్ ఫోన్ లాంచ్..ధర, ఫీచర్స్ ఇవే..!

జడ్చర్ల మున్సిపాలిటీలోని 1వ వార్డుకు చెందిన బీజేపీ బూత్ ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ సహ 40 మందికి పైగా కార్యకర్తలు నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. బీఆర్‌రెడ్డి గార్డెన్ లో జరిగిన కవేరమ్మపేట ముఖ్య నాయకుల సమావేశంలో ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి వారందరికీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన బీజేపీ నాయకులు మాట్లాడుతూ మతం పేరిట రాజకీయాలు చేసే మాత పార్టీలు తమకు వద్దని, గత తొమ్మిదేళ్లుగా బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి సంక్షేమ ఫలాలకు ఆకర్షితులై పార్టీలో చేరుతున్నట్లు చెప్పారు. జడ్చర్ల కూడా 2014 కు ముందు 2014 తర్వాత ఎంతో అభివృద్ధి చెందిందని ఈ సందర్భంగా చెప్పారు.

Also Read : Peanut Farming : వేరుశనగ సాగులో అధిక లాభాల కోసం తీసుకోవాల్సిన మెళుకువలు..