మన తెలుగు రాష్ట్రాల్లో వాణిజ్య పంటగా పెరుగుతున్న పంటలల్లో వేరుశనగ కూడా ఒకటి.. నూనెల తయారీలో ఎక్కువగా వాడటం వల్లే వీటికి డిమాండ్ ఎక్కువ.. ప్రధానంగా యాసంగిలో అధిక విస్తీర్ణంలో పండిస్తారు..ఈ పంట సాగుకు అనువైన తేలిక పాటి నేలలు మరియు తుంపర పద్ధతి ద్వారా సులువైన నీటి యాజమాన్యం వలన యాసంగిలో ఈ పంట యొక్క విస్తీర్ణం గణనీయంగా పెరుగుచున్నది. ఈ పంటలో నూనె అధికంగా ఉంటుంది.. ఈ పంట గురించి మరిన్ని వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..
ఈ పంట వెయ్యడానికి ముందుగా విత్తన శుద్ధి చెయ్యడం చాలా మంచిది.. లేకుంటే అనేక రకాల తెగుళ్లు వచ్చే అవకాశం ఉంటుంది.. కిలో విత్తనానికి 1 గ్రా. టెబ్యుకొనజోల్ 2 డి.ఎస్ లేదా 3 గ్రా. మాంకోజెబ్ పొడి మందు పట్టించాలి. కాండం కుళ్ళు వైరస్ తెగులు ఆశించే ప్రాంతాలలో 20 మి.లీ. ఇమిదాక్లోప్రిడ్ 600 ఎఫ్.ఎస్ ను 7 మి.లీ, నీటిలో కలివి ఒక కిలో విత్తనానికి పట్టించాలి.. వేరుకుళ్ళు, మొదలు కుళ్ళు మరియు కాండము కుళ్ళు తెగుళ్ళు ఎక్కువగా ఆశించే పరిస్థితులలో కిలో విత్తనానికి 10 గ్రా. ట్రైకోజెర్మా విరిడిని పట్టించి విత్తనాలను బాగా కలపాలి..
ఈ పంటను విత్తుకోవడానికి అనువైన సమయం అక్టోబరు రెండవ పక్షంలోపు, సెప్టెంబరు మొదటి పక్షం నుండి నవంబరు రెండవ వక్షం వరకు విత్తుకోవచ్చును. నేల తయారీ విషయానికివస్తే ఇసుకతో కూడిన గరప నేలలు లేదా నీరు త్వరగా ఇంకే ఎర్ర చల్కా నేలలు వేరుశనగ సాగుకు చాలా అనుకూలమైనవి..నేలను బాగా దున్ని చదును చేసి మరీ దున్నడం మంచిది..యాసంగిలో నీటి పారుదల క్రింద సాగుచేసేటప్పుడు 22.5-10సెం.మీ. దూరంలో విత్తుకోవాలి. ఖరీఫ్‌లో ఒక చదరవు మీటరుకి 38 మొక్కలు, యానంగిలో ఒక చదరపు మీటరుకి 44 మొక్కలు ఉండేలా మొక్కల సాంద్రత పాటించాలి… మొక్కల మధ్య దూరం ఉంచాలి.. తెగుళ్ల నుంచి బయపడవచ్చు.. కలుపు మొక్కలను ఎప్పటికప్పుడు తీసివేయ్యడం మంచిది.. తెలుగుళ్ళ విషయంలో కాస్త జాగ్రత్తలు తీసుకుంటే మంచి లాభాలను పొందవచ్చు.. ఈ పంట గురించి మరిన్ని వివరాల కోసం వ్యవసాయ నిపుణుల సలహా తీసుకోవడం మంచిది..