Kethireddy vs JC: జేసీకి ఎమ్మెల్యే కేతిరెడ్డి సవాల్.. అది నిరూపిస్తే రాజకీయాలకు గుడ్‌బై..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kethireddy vs JC: టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డికి బహిరంగ సవాల్ విసిరారు ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి.. తాడిపత్రి అభివృద్ధికి ఎవరు కృషి చేశారో చర్చకు సిద్ధమన్న ఆయన.. నేను ఎమ్మెల్యే అయిన తర్వాతే తాడిపత్రి నియోజకవర్గం ప్రశాంతంగా ఉందన్నారు.. అయితే, నా హయాంలో అభివృద్ధి జరగలేదని నిరూపిస్తే నేను రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటాను అంటూ ఛాలెంజ్ చేశారు.. ఇదే సమయంలో.. నిరూపించలేకపోతే నీవు.. నీ కుటుంబ సభ్యులు రాజకీయాల నుంచి తప్పుకుంటారా? అని ప్రశ్నించారు.
Read Also: Jammu Kashmir: పూంచ్ జిల్లాలో ఆర్మీ ట్రక్కుపై ఉగ్రవాదులు మెరుపుదాడి.. ముగ్గురు జవాన్లు మృతి
Also Read
ఇక, టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి రాజకీయ ఉనికి కోసం పాకులాడుతున్నారని విమర్శించారు పెద్దారెడ్డి.. తాడిపత్రి అభివృద్ధికి జేసీ ప్రభాకర్ రెడ్డి అడుగడుగునా అడ్డు పడుతున్నారని ఆరోపించిన ఆయన.. అమృత్ స్కీం కింద తాడిపత్రి మునిసిపాలిటీకి 52 కోట్ల రూపాయలు రాకుండా అడ్డుకుంటున్నారని ఫైర్ అయ్యారు. సొంత పొలాలకు మాత్రమే నీరు విడుదల చేసుకునే నైజం టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిదేనని దుయ్యబట్టారు. టీడీపీ పాలనలో సాగునీరు అడిగే రైతుల మోటార్లు లాక్కెళ్లిన చరిత్ర జేసీ కుటుంబానిదేనంటూ ఆరోపణలు గుప్పించారు. సాగునీటి కోసం మిడుతూరు హైవేపై జేసీ ప్రభాకర్ ఆందోళన చేయడం హాస్యాస్పదమని మండిపడ్డారు. ప్రజలను పక్కదారి పట్టించేందుకే జేసీ ప్రభాకర్ రెడ్డి ఆందోళన కార్యక్రమాలు చేస్తున్నారని పేర్కొన్నారు. మరోవైపు.. టిక్కెట్ల కేటాయింపు విషయంలో సీఎం వైఎస్ జగన్ దే తుది నిర్ణయం అన్నారు. అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా శిరసా వహిస్తా.. చివరకు కుప్పం నుంచి పోటీ చేయాలని ఆదేశించినా సిద్ధమని స్పష్టం చేశారు ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి.
తాజావార్తలు
-
Samuk: ఏలియన్ సినిమాకు సిద్ధమవుతున్న అక్షయ్ .. 90% షూటింగ్ లండన్‌లో…
-
AI పెట్టుబడుల వేళ Oracleలో ఉద్యోగాల కోతలు.. వేలాది ఉద్యోగాలపై వేటు?
-
CM Vijay: ఆ స్థానాలే కొనసాగించాలి.. డీలిమిటేషన్‌పై అసెంబ్లీలో విజయ్ తీర్మానం
-
N Chandrasekaran: టాటా గ్రూప్‌లో కీలక పరిణామం.. చైర్మన్ పదవికి ‘చంద్రశేఖరన్’ రాజీనామా?
-
TTD: తిరుమలకు వచ్చే విదేశీ భక్తులకు గుడ్ న్యూస్..
ట్రెండింగ్
-
Akhil NRD: “ప్రేమ పెళ్లి”.. కండక్టర్‌తో లేచిపోయిన ప్రముఖ యూట్యూబర్ భార్య..
-
Ridge Gourd Peel Chutney: బీరకాయ తొక్కతో నోరూరించే పచ్చడి.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే!
-
4K 180Hz డిస్ప్లేతో 55, 65, 75 అంగుళాల్లో Hisense UR8S MiniLED TVలు లాంచ్..!
-
9,070mAh బ్యాటరీ, IP69 రేటింగ్, AMOLED డిస్ప్లేతో REDMI K100 Pro Max లాంచ్..!
-
200MP ట్రిపుల్ కెమెరా సెటప్, 8,580mAh బ్యాటరీ, 185Hz డిస్ప్లేతో REDMI K100 Pro లాంచ్.. ధర ఎంతంటే?