తెలంగాణలో రాజకీయం ఇప్పుడు మునుగోడు చుట్టే తిరుగుతోంది. మునుగోడు ఉప ఎన్నిక ప్రచారంలో ఆయా పార్టీల నేతలు తమ అభ్యర్థిని గెలిపించేందుకు ప్రచారాల జోరు పెంచారు. అయితే.. తాజాగా ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ మునుగోడు ఉప ఎన్నిక ప్రచారంలో మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేలా మునుగోడులో బీజేపీ నేతలు వ్యవహరిస్తున్నారన్నారు. ఆచరణ సాధ్యం కాని హామీలు ఇస్తున్నారని, రాచకొండకు 1000 కోట్లు కేటాయించే దమ్ము కిషన్ రెడ్డి ఉందా అని ఆయన ప్రశ్నించారు. ఒక లంగను దొంగను రక్షించేందుకు బీజేపీ నేతలు మునుగోడు మీద పడుతున్నారని ఆయన విమర్శించారు. మునుగోడులో బీజేపీ నేతలను తరిమికొడతారని ఆయన వ్యాఖ్యానించారు. బీజేపీ, కాంగ్రెస్‌లు చీకటి ఒప్పందాలు కుదుర్చుకున్నాయని, కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్యలతో అది స్పష్టం అవుతోందన్నారు. ఉద్యమకారులు అంతా మళ్ళీ టీఆర్ఎస్‌లో చేరుతున్నారని, రాజగోపాల్ రెడ్డి పైసలతో అహంకారపూరితంగా వ్యవహరిస్తున్నాడని ఆయన మండిపడ్డారు.
Also Read : Minister KTR :అభివృద్ధి మా మతం.. జన హితమే మా అభిమతం
రాజగోపాల్ రెడ్డి కాదు…రాజగప్పాల్ రెడ్డి అని అంటూ గాదరి కిషోర్ విమర్శనాస్త్రాలు సంధించారు. కేసీఆర్ గురించి ఇష్టా రాజ్యాంగ మాట్లాడితే నాలుక చీరెస్తమని ఆయన హెచ్చరించారు. అనంతరం ఎమ్మెల్యే సైదిరెడ్డి మాట్లాడుతూ.. మునుగోడు ఉపఎన్నిక వచ్చిన ఎన్నిక కాదు.. తెచ్చిన ఎన్నిక మాత్రమేనని, సొంత లాభం కోసమే బీజేపీ ఉపఎన్నిక తీసుకొచ్చిందన్నారు. చిన్న పిల్లల్ని ప్రచారానికి వాడుకొని ఓటర్లు మా వైపు ఉన్నారని చెప్తున్నారని, మునుగోడు గాని, రాష్ట్రానికి గాని ఒక్క పైసా పని చేశారన్నారు. ఒక్కనాడైన నియోజకవర్గంలో రాజగోపాల్ రాత్రి నిద్ర చేశాడా అని ఆయన ప్రశ్నించారు. నియోజకవర్గ ప్రజలకు రాజగోపాల్ ఏం చేశాడని ఆయన ప్రశ్నించారు.