Site icon NTV Telugu

MLA Sayanna : బీఆర్‌ఎస్‌లో విషాదం.. ఎమ్మెల్యే సాయన్న కన్నుమూత

G Sayanna

G Sayanna

బీఆర్‌ఎస్‌లో విషాదం చోటు చేసుకుంది. సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ ఎమ్మెల్యే సాయన్న కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఎమ్మెల్యే సాయన్న ఇవాళ ఉదయం షుగర్‌ లెవెల్స్‌ పడిపోవడంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. అయితే.. యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సాయన్న తుది శ్వాస విడిచారు. అయితే.. గత కొన్ని రోజులుగా సాయన్న కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారు. ఐదుసార్లు ఎమ్మెల్యేగా సాయన్న గెలిచారు. టీడీపీ తరుఫున మూడు సార్లు ఎమ్మెల్యేగా సాయన్న గెలుపొందారు. రెండుసార్లు బీఆర్‌ఎస్‌ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అయితే.. సాయన్న మృతిపై పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.

Also Read : Ravi Shankar Prasad: మోదీని ప్రజలు విశ్వసిస్తున్నారు.. నితీష్ కుమార్ ఎప్పటికీ ప్రధాని కాలేడు..

సాయన్న తెలుగుదేశం పార్టీతో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించాడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1994 నుండి 2009 వరకు మూడుసార్లు తెలుగుదేశం పార్టీ తరపున సికింద్రాబాద్ కంటోన్మెంట్ శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. 2009లో జరిగిన ఎన్నికల్లో ఓడిపోయాడు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత 2014లో జరిగిన తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీచేసి సమీప తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అభ్యర్థి గజ్జెల నగేష్ పై 3275 ఓట్ల మెజారిటీ తో గెలుపొందాడు. ఆయన 2015లో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలకమండలి సభ్యుడిగా నియమితుడయ్యాడు. తరువాత టీఆర్ఎస్ పార్టీలో చేరాడు. 2018లో జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ పై పోటీ చేసి సమీప కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సర్వే సత్యనారాయణ పై 37,568 ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు.

Also Read : Taraka Ratna: తారక రత్న భౌతికకాయానికి నివాళులు అర్పించిన కోడలి నాని…

Exit mobile version