NTV Telugu Site icon

Etela Rajender : ప్రపంచం మొత్తం మునుగోడు వైపు చూస్తుంది

Etela Rajender

Etela Rajender

నల్లగొండ జిల్లాలోని మునుగోడు బీజేపీ కార్యాలయంలో ఈటెల రాజేందర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హుజురాబాద్ లో నన్ను ఓడించడానికి చేసిన ప్రయత్నమే మునుగొడులో మరోసారి చేస్తున్నారు కేసీఆర్.. అన్ని మంచి పనులు చేస్తే, నిజంగా అభివృద్ధి జరిగి ఉంటే ఇంత మంది ఎందుకు ప్రచారానికి వస్తున్నారు.. ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు పెడుతున్నారు.. హుజురాబాద్ లో ఇచ్చిన తీర్పు మునుగోడులో కూడా ఇవ్వాలని నా విజ్ఞప్తి.. మునుగోడు ప్రజలు కేసీఆర్ కు గుణపాఠం చెప్పాలనినా విజ్ఞప్తి..

 

ప్రపంచం మొత్తం మునుగోడు వైపు చూస్తుంది… ఓటుకు లక్ష ఇచ్చినా తీసుకోండి.. దళిత బంధు, గిరిజన బంధు ఇవ్వమని మీ దగ్గరకు వస్తున్న మంత్రులకు, ఎమ్మెల్యేలకు డిమాండ్ చేయండి… రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసిన తర్వాతే మునుగోడు అభివృద్ధి, సంక్షేమం వచ్చింది… ప్రచారానికి వస్తున్న బీజేపీ నేతలపై పోలీసులు వేధింపులకు పాల్పడుతున్నారు.. అటువంటి అధికారులపై భవిష్యత్ లో కఠిన చర్యలు ఉంటాయి.. వారిపై ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేస్తామని ఈటల రాజేందర్‌ వ్యాఖ్యానించారు.