Daggupati Prasad: దళారుల మాటలు నమ్మొద్దు.. 24 గంటలు అందుబాటులో ఉంటా.. ఎప్పుడైనా రావొచ్చు..
- అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో దళారీల మాట ఎవరు నమ్మవద్దని.. మీకు పదవులు లేదా ఇతర పనులు చేయిస్తామని డబ్బులు అడిగితే ఇవ్వద్దని సూచించారు ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్
- మీకు ఏ పని కావాలన్నా 24x7 నేను అందుబాటులో ఉంటాను.. ఎప్పుడైనా మీరు రావచ్చని తెలిపారు దగ్గుపాటి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Daggupati Prasad: అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో దళారీల మాట ఎవరు నమ్మవద్దని.. మీకు పదవులు లేదా ఇతర పనులు చేయిస్తామని డబ్బులు అడిగితే ఇవ్వద్దని సూచించారు ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్.. మీకు ఏ పని కావాలన్నా 24×7 నేను అందుబాటులో ఉంటానని.. ఎప్పుడైనా మీరు రావచ్చని దగ్గుపాటి అన్నారు. అనంతపురం నగరంలోని ఓల్డ్ టౌన్, రైల్వే స్టేషన్ సమీపంలోని అన్న క్యాంటీన్లను ఆయన పరిశీలించారు. తెలుగుదేశం పార్టీ హయాంలో నిత్యం పేదల ఆకలి తీర్చిన ఈ క్యాంటీన్లు మూతపడిన తీరు గురించి ఆయన ఆరా తీశారు. పూర్తిగా శిథిలావస్థకు చేరుకున్న ఈ క్యాంటీన్లను వెంటనే మరమ్మత్తులు చేయించాలని ఆదేశించారు. త్వరలోనే వీటిని తెరిచి మళ్లీ పేదలకి తక్కువ ధరకే భోజనం అందిస్తామని స్పష్టం చేశారు.
Read Also: PM Modi: ఇటలీలో మోడీ బిజిబిజీ.. అగ్ర నేతలతో సమావేశం
Also Read
ఇక, ఈ సందర్భంగా దగ్గుపాటి మాట్లాడుతూ.. నిన్నటి వరకు రాష్ట్రం ఒక అంధకారంలో ఉందని.. ఇప్పుడు చంద్రబాబు రూపంలో వెలుగు వచ్చిందని అన్నారు. ఇచ్చిన మాట ప్రకారం ఐదు హామీల మీద ఆయన సంతకాలు చేశారని అన్నారు. ఇప్పటి వరకు జగన్ ఐదేళ్లలో ఒక్క టీచర్ పోస్ట్ కూడా భర్తీ చేయలేదన్నారు. కానీ, చంద్రబాబు ఒకేరోజు 16 వేలకు పైగా పోస్టులు భర్తీ చేసేలా తొలి సంతకం చేశారన్నారు. ల్యాండ్ టైటిల్ యాక్ట్ ఒక పిచ్చి తుగ్లక్ చర్య అని.. అందుకే ఆ చట్టాన్ని చంద్రబాబు రద్దు చేస్తూ రెండవ సంతకం చేశారన్నారు. 60 లక్షల మందికి పైగా వృద్ధులు, వికలాంగులకు మేలు చేకూర్చే విధంగా పింఛన్ల పెంపుపై మూడో సంతకం చేశారన్నారు. పేదల ఆకలి తీర్చే విధంగా అన్న క్యాంటీన్లను ఓపెన్ చేస్తూ నాలుగో సంతకం చేశారని.. యువతలో ఉద్యోగ నైపుణ్యాలు పెంపొందించేందుకు స్కిల్ సెన్సెస్ పై ఐదో సంతకం చేశారని వివరించారు ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్.
తాజావార్తలు
-
OTR : మేయర్ సీటు విషయంలో టీడీపీ ప్రయోగం చేస్తుందా?
-
Fahadh Faasil : ‘జై ఎన్టీఆర్’ అంటూ ఫాఫా.. తారక్‌తో ఆ రాత్రులు మరిచిపోలేనంటూ
-
Story Board : సైబర్ నేరాలు ఎందుకు పెరుగుతున్నాయి..?
-
Jr.NTR : కార్తికేయ నా తమ్ముడి లాంటోడు.. ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్
-
SS Rajamouli : ‘ఏడ్చి ఏడ్చి కళ్లు ఉబ్బిపోయాయి.. ఫాఫా నటన అద్భుతం’
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!