Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Sports Mitchell Starc Fastest Five Wicket Haul 100th Test

Mitchell Starc: స్టార్క్‌ అరుదైన ఘనత.. టెస్ట్ క్రికెట్‌ చరిత్రలోనే మొదటిసారి!

Published Date :July 15, 2025 , 11:30 am
By Sampath Kumar
  • మిచెల్‌ స్టార్క్‌ అరుదైన ఘనత
  • టెస్ట్ క్రికెట్‌ చరిత్రలోనే మొదటిసారి
  • 100వ టెస్ట్‌ మ్యాచ్‌లు ఆడి 402 వికెట్స్
Mitchell Starc: స్టార్క్‌ అరుదైన ఘనత.. టెస్ట్ క్రికెట్‌ చరిత్రలోనే మొదటిసారి!
  • Follow Us :
  • google news
  • dailyhunt

Mitchell Starc Fastest Five-Wicket Haul in Test Cricket: ఆస్ట్రేలియా స్టార్ పేసర్ మిచెల్‌ స్టార్క్‌ టెస్ట్ క్రికెట్‌ చరిత్రలోనే అరుదైన ఘనతను ఖాతాలో వేసుకున్నాడు. టెస్ట్ చరిత్రలో బంతుల పరంగా అ‍త్యంత వేగంగా ఐదు వికెట్ల ప్రదర్శనను సాధించాడు. కింగ్‌స్టన్‌లో వెస్టిండీస్‌తో జరిగిన మూడో టెస్ట్ (డే-నైట్ టెస్ట్) మ్యాచ్‌లో 15 బంతుల్లోనే 5 వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు. స్టార్క్ తన 100వ టెస్ట్ మ్యాచ్‌లో ఈ ఫీట్ నమోదు చేయడం విశేషం. రెండో ఇన్నింగ్స్‌లో 7.3 ఓవర్లు వేసిన స్టార్క్‌.. 9 పరుగులు మాత్రమే ఇచ్చి 6 వికెట్లు తీశాడు. ఇదే టెస్టులో ఈ ఆసీస్‌ స్పీడ్‌ గన్‌ 400 టెస్ట్ వికెట్లను కూడా అధిగమించాడు. 1947లో ఆస్ట్రేలియా బౌలర్ ఎర్నీ తోషాక్ 19 బంతుల వ్యవధిలో 5 వికెట్లు పడగొట్టాడు.

సబీనా పార్క్‌లో వెస్టిండీస్‌ రెండో ఇన్నింగ్స్‌లో మొదటి బంతికే మిచెల్‌ స్టార్క్‌ వికెట్ పడగొట్టాడు. అదే ఓవర్లోని చివరి రెండు బంతులకు వికెట్లు పడగొట్టాడు. తన రెండో ఓవర్‌ను మెయిడిన్ వేశాడు. మూడో ఓవర్‌లోని మొదటి, మూడో బంతికి వికెట్స్ తీశాడు. దాంతో స్టార్క్‌ ఖాతాలో ఫైఫర్ చేరింది. రెండుసార్లు హ్యాట్రిక్ మిస్ అయింది. ఎనిమిదవ ఓవర్‌లో మరో వికెట్ తీసి.. ఆరు వికెట్స్ ఖాతాలో వేసుకున్నాడు. కెరీర్‌లో 100వ టెస్ట్‌ మ్యాచ్‌ ఆడుతున్న స్టార్క్‌.. అద్భుత ప్రదర్శనతో ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డుతో పాటు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీస్‌’ అవార్డు కూడా అందుకున్నాడు.

Also Read: Banakacherla Project: ఏపీకి షాక్ ఇచ్చిన తెలంగాణ!

పింక్‌ బాల్‌తో మిచెల్‌ స్టార్క్‌ రెచ్చిపోతున్నాడు. ఇపటివరకు 14 టెస్ట్‌లు ఆడిన స్టార్క్‌.. 17.08 సగటుతో 81 వికెట్లు తీశాడు. డే-నైట్ టెస్ట్ మ్యాచ్‌లలో ఐదు 5 వికెట్ల ప్రదర్శనలు ఉన్నాయి. 35 ఏళ్ల స్టార్క్‌ ఇపటివరకు 100వ టెస్ట్‌ మ్యాచ్‌లు ఆడి 402 వికెట్స్ పడగొట్టాడు. అత్యుత్తమ గణాంకాలు 6/9. ఐదు వికెట్ల ప్రదర్శన 16 సార్లు చేశాడు.

 

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Mitchell Starc
  • Mitchell Starc 100th Test
  • Mitchell Starc 5 Wickets
  • Mitchell Starc 6 Wickets
  • West Indies vs Australia

తాజావార్తలు

  • Off The Record: బీఆర్ఎస్‌ కంచుకోట.. సిద్దిపేటలో బలహీనపడుతున్న కాంగ్రెస్..

  • Earthquake: ఢిల్లీలో భూకంపం.. ప్రాణ భయంతో వీధుల్లోకి పరుగులు పెట్టిన జనాలు..

  • DA Hike: ప్రభుత్వ ఉద్యోగులు,పెన్షనర్లకు శుభవార్త.. ఈ సారి భారీగానే పెరుగుదల..!?

  • Off The Record: తెలంగాణ ఈఎన్సీ జనరల్ పోస్ట్ కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ..

  • Toothpaste: టూత్ పేస్ట్ ఫ్యాక్టరీ సీజ్.. 130 కిలోల పేస్ట్‌ స్వాధీనం..

ట్రెండింగ్‌

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • Fuel price: పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే.. ఆ ఎఫెక్ట్‌ ఎలా ఉంటుందో తెలుసా?.. షాకింగ్ రిపోర్టు..

  • 6.8 అంగుళాల భారీ TFT LCD స్క్రీన్‌, 7,000mAh బ్యాటరీతో Honor Play 80 Pro లాంచ్..!

  • స్లిమ్ డిజైన్.. పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్.. 100MP కెమెరాతో Honor X80i లాంచ్.. ధర ఎంతంటే.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions