హాట్ బ్యూటీ అమీజాక్సన్ మిషన్ ఛాప్టర్ 1 మూవీతో దాదాపు ఆరేళ్ల గ్యాప్ తర్వాత కోలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇచ్చింది.అరుణ్ విజయ్ హీరోగా తెరకెక్కిన ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ సంక్రాంతి కానుకగా థియేటర్లలో విడుదలైంది.రొటీన్ స్టోరీ కారణంగా ఈ సినిమా ప్రేక్షకుల్ని అంతగా మెప్పించలేకపోయింది. థియేటర్లలో విడుదలైన రెండు నెలల తర్వాత మిషన్ ఛాప్టర్ 1 మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. శుక్రవారం నుంచి అమెజాన్ ప్రైమ్‌లో ఈ యాక్షన్ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.తండ్రీకూతుళ్ల అనుబంధానికి యాక్షన్ అంశాలను మేళవించి రూపొందించిన మిషన్ ఛాప్టర్ వన్ సినిమాకు ఏఎల్ విజయ్ దర్శకత్వం వహించాడు. అమెజాన్ ప్రైమ్‌లో తమిళంతో పాటు తెలుగులో కూడా ఈ మూవీ స్ట్రీమింగ్ కానున్నట్లు ప్రచారం జరిగింది. కానీ శుక్రవారం తమిళ వెర్షన్ మాత్రమే రిలీజైంది. తెలుగు వెర్షన్‌పై మేకర్స్ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.థియేటర్లలో తెలుగులో రిలీజ్ చేయాలని మేకర్స్ భావించారు. ట్రైలర్స్, టీజర్స్ ను కూడా రిలీజ్ చేశారు. కానీ సంక్రాంతికి స్ట్రెయిట్ సినిమాల పోటీ ఎక్కువగా ఉండటంతో మిషన్ ఛాప్టర్1తెలుగు వెర్షన్ రిలీజ్ పోస్ట్‌పోన్ అయ్యింది.
సంక్రాంతి తర్వాత ఓ వారం గ్యాప్ తీసుకొని థియేటర్ల ద్వారా ఈ సినిమాను తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ అనుకున్నారు.కానీ తమిళంలో డిజాస్టర్ కావడం ఆ ఎఫెక్ట్ తెలుగు వెర్షన్‌పై గట్టిగా పడింది. తెలుగులో ఈ మూవీ అస్సలు రిలీజే కాలేదు. థియేటర్లలో కాకుండా డైరెక్ట్‌గా ఓటీటీలోనైనా తెలుగు వెర్షన్‌ను రిలీజ్ చేస్తారని అనుకున్నారు. అది కూడా జరగలేదు.హాస్పిటల్‌లో ప్రాణాలతో పోరాడుతోన్న తన కూతురుని కలుసుకోవడానికి ఓ ఖైదీఎలాంటి పోరాటం చేశాడు? విదేశీ జైలులో అతడు ఖైదీగా మారడానికి కారణం ఏమిటి అనే అంశాలతో మిషన్ ఛాప్టర్ 1 మూవీని దర్శకుడు ఏఎల్ విజయ్ తెరకెక్కించాడు. ఈ సినిమాలో అమీజాక్సన్ పోలీస్ ఆఫీసర్‌గా నటించింది. నిమిషా సజయన్ మరో హీరోయిన్‌గా కనిపించింది.మిషన్ ఛాప్టర్ వన్‌తోనే ఆరేళ్ల గ్యాప్ తర్వాత అమీజాక్సన్ కోలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇచ్చింది. అమీజాక్సన్‌ను మదరాసిపట్టణం సినిమాతో హీరోయిన్‌గా కోలీవుడ్‌కు ఏఎల్ విజయ్ పరిచయం చేశాడు. అతడి సినిమాతోనే తిరిగి తమిళ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది.