Mission Bhagiratha : పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ఆదేశాలతో ఎర్రమంజిల్ లోని మిషన్ భగీరథ హెడ్ ఆఫీస్ లో కాల్ సెంటర్ ప్రారంభించారు. సోమవారం నుంచి మిషన్ భగీరథ టోల్ ఫ్రీ నెంబర్ 1800-599-4007 అందుబాటులోకి వచ్చింది. గ్రామీణ ప్రాంతాల్లో మిషన్ భగీరథ నీటి సరఫరాలో వచ్చే ఇబ్బందులపై ఫిర్యాదు చేసే వెసులుబాటు కల్పించారు. సూపరిండెంట్ ఇంజనీర్ నేతృత్వంలో ఐదుగురు సిబ్బందితో 24 గంటలు పనిచేయనున్న కాల్ సెంటర్ ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. పగలు వచ్చే కాల్స్ ను అటెండ్ చేసి సిబ్బంది వివరాలు నమోదు చేసుకోనున్నారు. రాత్రి వచ్చే కాల్స్ రికార్డు అవుతాయని అధికారులు తెలిపారు. ప్రతి రోజు వచ్చే ఫిర్యాదులను మిషన్ భగీరథ ఈఎన్సీ కృపాకర్ రెడ్డి సమీక్షించనున్నారు. 24 గంటల్లో సమస్యకు పరిష్కారం చూపేలా చర్యలు తీసుకుంటామని అధికారులు వివరించారు. టోల్ ఫ్రీ ద్వారా అందే ఫిర్యాదులను క్షేత్ర స్థాయికి చేరవేసి పరిష్కారానికి అవసరమైన సలహాలు సూచనలు చేయడంతో పాటు పరిష్కారం కోసం అవసరమయ్యే ఏర్పాట్లు చేయనన్నారు మిషన్ భగీరథ హెడ్ ఆఫీస్ సిబ్బంది.
Harish Rao : క్రిస్మస్‌ను అధికారికంగా నిర్వహించిన ఒకే ఒక్క ముఖ్యమంత్రి కేసీఆర్
మంత్రిగా సీతక్క భాద్యతలు స్వీకరించాక మిషన్ భగీరథపై ప్రత్యేక దృష్టి పెట్టారు. నిరంతర సమీక్షలతో మిషన్ భగీరథలో సమస్యలు లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. మిషన్ భగీరథ నీటిపై ప్రజలకు విశ్వాసం కలిగించేలా అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. నీటి సరఫారాలో లీకేజీలు, అవంతరాలను అరికట్టేలా కీలక నిర్ణయాలు తీసుకున్నారు మంత్రి సీతక్క. తాగు నీటి సరఫరా సజావుగా సాగేలా చూసేందుకు గ్రామాల్లో మంచి నీటి సహయకుల నియామకం చేపట్టారు. ఎలాంటి ఇబ్బందులున్నా తక్షణం రంగంలోకి దిగి మరమ్మత్తులు చేసేలా శిక్షణ పూర్తి చేశారు. మిషన్ భగీరథ సరఫరాలో ఇబ్బందులు తలెత్తితే ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా తాగునీటిని సరఫరా చేసేలా ఏర్పాట్లు చేశారు. పదేండ్లు పట్టించుకోని 64,218 చేతి పంపులను, 45,882 సింగల్ ఫేజ్ మోటర్లను, 32,517 PWS (పైప్డ్ వాటర్ సప్లై) మోటర్లకు మరమత్తులు చేసి వినియోగంలోకి తెచ్చిన మిషన్ భగీరథ శాఖ.. తాజాగా మిషన్ భగీరథ కాల్ సెంటర్ ఏర్పాటుతో గ్రామీణ నీటి సరఫరా సమస్యలకు చెక్ పెట్టనుంది.
Bobby : బాలకృష్ణతో సినిమా చేస్తే ఆయనతో ప్రేమలో పడిపోతారు