నిన్న సాయంత్రం ఇంటిముందు ఆడుకుంటూ కనిపించకుండా పోయిన చిన్నారి విగతజీవిగా కనిపించిన ఘటన ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సాహిత్ అనే చిన్నారి నిన్న సాయంత్రం ఇంటి ముందుకు ఆడుకుంటున్నాడు. అయితే.. బయటకు ఆడుకునేందుకు వెళ్లిన సాహిత్ తిరిగి ఇంటికి రాకపోవడంతో సాహిత్ తల్లిదండ్రులు వెతికారు. అయితే.. రాత్రి వరకు అతని ఆచూకీ లభించకపోవడంతో ఎల్బీనగర్ పోలీసులకు తల్లిదండ్రులు ఆశ్రయించారు. అయితే.. సాహిత్ తల్లిదండ్రులు ప్రేమ వివాహం కావడంతో ఆ కోణంలో విచారించిన పోలీసులు… సాహిత్ ఇంటి సమీపంలో ఉన్న సీసీ కెమెరాలు పరిశీలించారు. అయితే.. సీసీ కెమెరాల్లో ఎక్కడా కూడా బాబు రోడ్డుమీదికి వచ్చినట్టు కానీ తీసుకొచ్చినట్టుగాని కనిపించలేదు.
మరోవైపు సాహిత్ ఇంటి సమీపంలో నాలా ఉంది. ఇటీవల కాలంలో వరదలు వచ్చినప్పుడు ఆ నాలాకి ఉన్న జాలిని తొలగించిన స్థానికులు.. తిరిగి జాలిని పెట్టడం మర్చిపోయారు. దీంతో ఆడుకుంటూ వెళ్లి సాహిత్ ఆ నాలాలో పడినట్లు పోలీసులు గుర్తించారు. పది అడుగుల దూరంలోని పొదల్లో రాత్రి 12 గంటల సమయంలో చిన్నారి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.