Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Missing 12 Year Old Girl Case Ends Safely In Warangal Police Trace Children To Dharmavaram

Girl Missing: హోంవర్క్ అని వెళ్లి అదృశ్యం.. 12 ఏళ్ల చిన్నారి అదృశ్యం కథ సుఖాంతం..!

Published Date :March 31, 2026 , 1:05 pm
By Kothuru Ram Kumar
Girl Missing: హోంవర్క్ అని వెళ్లి అదృశ్యం.. 12 ఏళ్ల చిన్నారి అదృశ్యం కథ సుఖాంతం..!
  • Follow Us :
  • google news
  • dailyhunt

Girl Missing: వరంగల్ నగరంలోని కరీమాబాద్ ప్రాంతంలో కలకలం రేపిన 12 ఏళ్ల బాలిక అదృశ్యం కేసు సుఖాంతమైంది. గత కొన్ని రోజులుగా పోలీసులను ముప్పుతిప్పలు పెట్టిన ఈ మిస్టరీని మిల్స్ కాలనీ పోలీసులు ఛేదించారు. అదృశ్యమైన బాలికతో పాటు అదే ప్రాంతానికి చెందిన మరో బాలుడు కూడా అనంతపురం జిల్లాలోని ధర్మవరంలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.

Hyderabad: భారీ ‘వీర హనుమాన్ విజయ యాత్ర’.. ఏర్పాట్లపై పోలీసులు సమీక్ష..!

అసలేం జరిగిందన్న విషయానికి వెళితే.. ఈ నెల 27న కరీమాబాద్‌కు చెందిన 12 ఏళ్ల చిన్నారి, తన స్నేహితురాలి ఇంటికి వెళ్లి హోంవర్క్ చేసుకుని వస్తానని తల్లికి చెప్పి బయటకు వెళ్లింది. అయితే రాత్రి దాటినా బాలిక తిరిగి రాకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు బంధువుల ఇళ్లలో వెతికారు. ఎక్కడా ఆచూకీ లభించకపోవడంతో బాలిక తల్లి మిల్స్ కాలనీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తు ప్రారంభించారు.

దర్యాప్తులో భాగంగా పోలీసులు కాలనీలోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించగా, ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. సదరు బాలిక ఒంటరిగా వెళ్లలేదని.. అదే ప్రాంతానికి చెందిన 9 ఏళ్ల బాలుడితో కలిసి వెళ్లినట్లు సీసీటీవీ దృశ్యాల ద్వారా స్పష్టమైంది. సాంకేతిక పరిజ్ఞానం, ఇతర ఆధారాల సహాయంతో గాలించిన పోలీసులకు ఈ ఇద్దరు చిన్నారులు అనంతపురం జిల్లా ధర్మవరంలో ఉన్నట్లు సమాచారం అందింది.

MLA Padi Kaushik Reddy: ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి CID నోటీసులు.. స్పందించిన ఎమ్మెల్యే

చిన్నారుల ఆచూకీ దొరకడంతో వారి కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. ధర్మవరంలో ఉన్న ఆ ఇద్దరు చిన్నారులను క్షేమంగా వరంగల్‌ కు తీసుకువచ్చేందుకు మిల్స్ కాలనీ పోలీసు బృందం ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌కు బయలుదేరి వెళ్లింది. వారు తిరిగి వచ్చిన తర్వాత చిన్నారులు అంత దూరం ఎందుకు వెళ్లారు.? అనే విషయాలపై మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • CCTV investigation
  • child disappearance case
  • Crime News
  • dharmavaram
  • girl missing

తాజావార్తలు

  • Girl Missing: హోంవర్క్ అని వెళ్లి అదృశ్యం.. 12 ఏళ్ల చిన్నారి అదృశ్యం కథ సుఖాంతం..!

  • Hey Balwanth : ఓటీటీలోకి సుహాస్ ‘హే బలవంత్’.. ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?

  • Hyderabad: భారీ ‘వీర హనుమాన్ విజయ యాత్ర’.. ఏర్పాట్లపై పోలీసులు సమీక్ష..!

  • Hyderabad: హైదరాబాద్‌లో కలుషిత ‘అల్లం-వెల్లుల్లి’ పేస్ట్ గుట్టురట్టు.. రూ. 22 లక్షల సామగ్రి సీజ్!

  • NTRNEEL : ఎన్టీఆర్ – నీల్.. గాల్లో గూస్‌బంప్స్?

ట్రెండింగ్‌

  • Lava సంచలనం.. రూ. 7,999లకే 50MP కెమెరా, IP54 రేటింగ్ తో ‘Bold N2 Pro’ లాంచ్..!

  • Sanju Samson-CSK: అయ్యో పాపం.. సంజు ఖాతాలో చెత్త రికార్డు, సీఎస్‌కే కలిసి రాలేదా?

  • Ravindra Jadeja: పింక్ కలర్ నాకు బాగా సూట్ అయింది.. దూబేను అలా బుట్టలో వేశా!

  • MS Dhoni Invests: ఆ కంపెనీలో భారీగా పెట్టుబడులు పెట్టిన “మిస్టర్ కూల్”.. బ్రాండ్ అంబాసిడర్‌గా కూడా..!

  • Anand Mahindra: 1000 ఏళ్ల నాటి మెట్ల బావి.. టెక్నాలజీకి ఫిదా అయిపోయిన ఆనంద్ మహీంద్రా..

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions