Miss World 2025 : మిస్ వరల్డ్ – 2025 పోటీల్లో పాల్గొంటున్న ప్రపంచంలోని వివిధ దేశాలకు చెందిన సుందరీమణులు బుద్ధపూర్ణిమ సందర్భంగా సోమవారం నాగార్జునసాగర్‌లోని బుద్ధవనాన్ని సందర్శించనున్నారు. ఈ ప్రత్యేక ఆధ్యాత్మిక పర్యటనలో మొత్తం 30 దేశాలకు చెందిన మిస్ వరల్డ్ పోటీదారులు పాల్గొననుండగా, వీరిలో ఎక్కువమంది ఆసియా దేశాల నుంచి వచ్చినవారు ఉన్నారు. బౌద్ధమతంపై గల విశ్వాసం, బుద్ధుని చరిత్రపై ఆసక్తితో, ఈ సుందరీమణులు బౌద్ధ థీమ్ పార్క్‌లోని మహాస్థూపం వద్ద ప్రత్యేక ధ్యాన కార్యక్రమాల్లో పాల్గొంటారు. బుద్ధుని విగ్రహాల సమీపంలో ఆయా దేశాల సంప్రదాయాలకు అనుగుణంగా ప్రార్థనలు జరగనున్నాయి.
NANI : బ్రేక్ ఈవెన్ కు అడుగు దూరంలో ఆగిన హిట్ – 3
హైదరాబాద్ నుంచి పర్యాటక అభివృద్ధి సంస్థ ప్రత్యేక బస్సుల ద్వారా, భారీ బందోబస్తు మధ్య పోటీదారులను బుద్ధవనానికి తీసుకెళ్లనున్నారు. మార్గమధ్యలో నల్లగొండ జిల్లా చింతపల్లి సమీపంలోని అతిథిగృహం వద్ద కొంతసేపు విశ్రాంతి తీసుకుంటారు. అనంతరం విజయవిహార్‌లో ఫోటో సెషన్ అనంతరం బుద్ధవనంలోకి చేరుకుంటారు. లంబాడా కళాకారులు సంప్రదాయ నృత్యాలతో అతిథులను స్వాగతించనున్నారు. బుద్ధవనంలోని మహాస్థూపం, బుద్ధ పాదాలు, జతాక వనం, ఓపెన్ థియేటర్ ప్రత్యేకంగా అలంకరించబడ్డాయి. లేజర్ లైటింగ్, కళాత్మక డెకరేషన్ తో పర్యాటక వాతావరణాన్ని మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు.
బుద్ధవనంలో ధ్యానం అనంతరం, బైలికుప్ప నుండి వచ్చిన 25 మంది బౌద్ధ సన్యాసులు మహాబోధి పూజలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా పురావస్తు నిపుణుడు డా. శివనాగిరెడ్డి బుద్ధవనం ప్రాజెక్టు ప్రాశస్త్యాన్ని, నాగార్జునసాగర్ ప్రాంతంలోని బౌద్ధ వారసత్వాన్ని వివరించనున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అభివృద్ధి చేసిన ఈ 274 ఎకరాల బౌద్ధ థీమ్ పార్క్ బుద్ధుని జీవితం, బోధనలు, బౌద్ధ కళా సంపదను ప్రతిబింబించే విధంగా నిర్మించబడింది. మిస్ వరల్డ్ పోటీదారుల పర్యటన నేపథ్యంలో నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ నేతృత్వంలో 2వేల మంది పోలీసులతో భద్రత కల్పించారు. అదేవిధంగా కమలా నెహ్రూ ఏరియా ఆస్పత్రిలో ఐదు పడకలతో ప్రత్యేక వైద్య వార్డును వైద్య ఆరోగ్యశాఖ సిద్ధం చేసింది.
Diamond League: నీరజ్ చోప్రా నేతృత్వంలో రంగంలోకి నలుగురు అథ్లెట్లు..!
