మిస్ యూనివర్స్ విక్టోరియా క్జేర్ థీల్విగ్ తెలంగాణ పర్యటనలో ఉంది. మిస్ వరల్డ్ 2025 ప్రీ-ఈవెంట్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో భాగంగా హైదరాబాద్‌కు చేరుకుంది. ఆమె ఈ రోజు యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకుంది. క్జేర్ థీల్విగ్‌కు ఆలయ అధికారులు స్వాగతం పలికారు. ప్రత్యేక దర్శనం కల్పించారు. హిందు సాంప్రదాయ దుస్తులు ధరించిన క్జేర్ థీల్విగ్ స్వామికి ప్రత్యేక పూజలు, అఖండ దీపారాధన చేసింది. అనంతరం పూజారుల ఆశీర్వచనం తీసుకుంది. ఆలయ విశిష్టతను అధికారులు వివరించారు. ఆలయ అధికారులు విక్టోరియా క్జేర్ థీల్విగ్‌కు స్వామి చిత్రపటంతో పాటు ప్రసాదం అందించారు. సందర్శకుల పుస్తకంలో తన భావాలను వ్యక్తపరిచింది. “ఈ అనుభవం వర్ణించలేనిది” అని ఆమె పేర్కొంది.
READ MORE: Irregular Menstrual Cycle: మహిళలకి ఎందుకు ఋతు చక్రం సమస్యలు వస్తాయంటే?
ఇదిలా ఉండగా.. ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆసక్తిగా చూసే కార్యక్రమాల్లో మిస్ వరల్డ్ ఒకటి. కోట్లాది మంది ఈ వేడుకలను చూసేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. ఇలాంటి వేడుకలకు ఈసారి మన హైదరాబాద్ ఆతిథ్యం ఇవ్వబోతోంది. ఇప్పటికే విశ్వనగరంగా పేరొందిన మన భాగ్యనగరం పేరు.. మిస్ వరల్డ్ వేడుకలతో మరోసారి ప్రపంచవ్యాప్తంగా మార్మోగడం ఖాయం. అయితే నాణేనికి మరోకోణం ఉన్నట్టే మిస్ వరల్డ్ వేడుకలకు కూడా మరో కోణం ఉంటుంది. కాగా.. మే 7 నుంచి 31 వరకూ మిస్ వరల్డ్ పోటీలు హైదరాబాద్ లో జరగనున్నాయి. ప్రారంభ వేడుకలతో పాటు ముగింపు వేడుకలకు భాగ్యనగరం ఆతిథ్యం ఇవ్వబోతోంది. మిగిలిన ఈవెంట్లను తెలంగాణలోని పలు ప్రాంతాల్లో నిర్వహించేలా నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. దాదాపు 140 దేశాలకు చెందిన సుందరీమణులు మిస్ వరల్డ్ టైటిల్ కోసం పోటీ పడబోతున్నారు.
READ MORE: kavali Greeshma: ఆ పదవికి రాజీనామా చేసిన ఎమ్మెల్సీ కావలి గ్రీష్మ..