హైటెక్స్‌లో మిస్ వరల్డ్ ఫైనల్స్ కొనసాగుతున్నాయి. తాజాగా మిస్ వరల్డ్ పోటీల నుంచి మిస్ ఇండియా నందిని గుప్తా నిష్క్రమించారు. ఖండాల వారీగా టాప్ 5 నుంచి ఇద్దరిని షార్ట్ లిస్ట్ చేస్తున్నారు నిర్వాహకులు.. ఆసియా నుంచి టాప్ 2లోకి థాయ్‌లాండ్ అభ్యర్థి చేరారు. నువ్వు మస్‌వరల్డ్ అయితే ఏం చేస్తావని అడిగిన ప్రశ్నకు 45 సెకన్లలో మెరుగైన సమాధానం ఇచ్చిన వారికి అవకాశం కల్పించారు.. అభ్యర్థుల సమాధానాలకు జడ్జీల మార్కులు వేసి నిర్ణయిస్తారు. ఈ నేపథ్యంలో నందిని గుప్తా నిష్క్రమణకు గురైనట్లు తెలుస్తోంది. కాగా.. విజేతకు రూ. 8.5 కోట్ల నగదు, 1770 వజ్రాల కిరీటం, ఏడాది పాటు ఉచితంగా ప్రపంచ యాత్ర కల్పిస్తారు. ఈ పోటీలో ఒకవేళ గెలిచి ఉంటే.. అత్యధిక టైటిళ్ల విజేతగా భారత్ రికార్డు సృష్టించేది. ఈ కార్యక్రమానికి తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి.. సినీ ప్రముఖులు చిరంజీవి, నాగార్జున, రానా, విజయ్‌దేవరకొండ, ఖుష్బూ హాజరయ్యారు.
READ MORE: Acharya pramod krishnam: రాహుల్ గాంధీకి పాకిస్తాన్‌లో ఫుల్ క్రేజ్, అక్కడ పోటీ చేస్తే గెలుస్తాడు..
మిస్ వరల్డ్ విజేతను ఎలా ఎంపిక చేస్తారంటే..
మూడు దశల్లో జరిగే క్వార్టర్ ఫైనల్స్‌లో ఒక్కో ఖండం నుంచి 10 మందిని ఎంపిక చేస్తారు. అమెరికా, కరీబియన్స్ నుంచి 10 మంది, ఆఫ్రికా నుంచి 10 మంది, ఐరోపా నుంచి 10 మంది, ఏషియా, ఓషీనియా నుంచి 10 మందిని సెలెక్ట్ చేస్తారు. ప్రతి ఖండం నుంచి ఎంపికైన 10 మంది నుంచి సెకెండ్ స్టేజ్‌లో ఐదుగురిని ఎంపిక చేయనున్నారు. మళ్లీ ఈ ఐదుగురిలో మూడో దశలో ఇద్దరిని ఎంపిక చేస్తారు. ఇలా పోటీలో 8 మంది నిలువగా.. ఈ 8 మందిలో సెమీ ఫైనల్‌లో భాగంగా ప్రతి ఖండం నుంచి ఎంపికైన ఇద్దరిలో ఒకరిని టాపర్‌గా ఫైనలైజ్ చేస్తారు. మిగిలిన నలుగురి మధ్య ఫైనల్ పోటీ జరగనుంది. ప్రస్తుతం ఫైనల్‌లో నలుగురు నిలిచారు.
నలుగురిలో ఏషియా, ఓషీనియా గ్రూప్ నుంచి భారత్ తరపున ప్రాతినిధ్యం వహిస్తున్న నందినీ గుప్తా ఉంది. యూరప్ ఖండం నుంచి మిస్ ఐర్లాండ్ జాస్మిన్ గర్హాట్, ఆఫ్రికా నుంచి నమీబియాకు చెందిన సల్మా కామనియా, అమెరికా కరీబియన్ గ్రూప్ నుంచి మార్టిన్‌కు చెందిన ఆరెలీ బోచిమ్ ఎంపికయ్యారు. గ్రాండ్ ఫినాలేలో ఈ నలుగురే పాల్గొంటారు. ఈ నలుగురిలోనే ఒకరిని మిస్ వరల్డ్ కిరీటం వరించనుంది. ఇక మిస్ వరల్డ్ విజేతకు రూ.8.5 కోట్ల ప్రైజ్ మనీ అందజేయనున్నారు. మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్, మెయిన్ స్పాన్సర్ల ద్వారా ఈ ప్రైజ్ మనీ అందించనున్నారు.కాగా.. 1951 నుంచి ప్రపంచ సుందరి పోటీల్ని ప్రతి ఏటా నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు భారత్.. వెనెజువెలా ఆరుసార్లు చొప్పున కిరీటాన్ని సొంతం చేసుకున్నాయి. మన దేశం నుంచి తొలిసారి 1966లో రీటా ఫారియా ప్రపంచ సుందరి కిరీటాన్ని సొంతం చేసుకోగా.. 1994లో ఐశ్వర్యారాయ్.. 1997లో డయానా హెడెన్.. 1999లో యుక్తాముఖి.. 2000లో ప్రియాంక చోప్రా.. 2017లో మానుషి చిల్లర్ లు విజేతలుగా నిలిచారు. ఆసక్తికరమైన విషయం ఏమంటే.. ప్రపంచ సుందరి పోటీలు ప్రారంభమైన 15 ఏళ్లకు తొలిసారి భారత్ టైటిల్ సొంతం చేసుకుంటే.. ఆ తర్వాత 28 ఏళ్ల తర్వాత ఐశ్వర్యరాయ్ టైటిల్ ను సొంతం చేసుకుంది. ఆమె విజేతగా నిలిచిన తర్వాత గడిచిన 34 ఏళ్లలో 4 సార్లు భారత్ కు ఈ టైటిల్ దక్కింది. 1994 నుంచి 2000 మధ్యన ఆరేళ్ల వ్యవధిలో నాలుగుసార్లు ప్రపంచ సుందరి టైటిల్ ను భారత్ సొంతం చేసుకుంది. ఇంత స్వల్ప వ్యవధిలో మరే దేశానికి ఇన్ని టైటిళ్లు లభించలేదని చెబుతారు.
