Mirzapur 3:’మీర్జాపూర్ సీజన్ 3′ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఓటీటీ ఆడియెన్స్‌ను ఎంతగానో అలరించిన సూపర్ హిట్ వెబ్ సిరీస్ మీర్జా పూర్. ఇప్పటికే సక్సెస్ ఫుల్ గా రెండు సీజన్లను పూర్తి చేసుకున్న ఈ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ మూడో సీజన్ రిలీజ్‌కు ముహూర్తం ఫిక్స్ అయ్యింది.చాలా రోజుల క్రితమే షూటింగ్ పూర్తి చేసుకున్న మీర్జాపూర్ 3 ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ మరియు డబ్బింగ్ పనులు జరుపుకుంటున్నట్లు తెలుస్తుంది.అయితే మార్చి చివరి వారంలోనే ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా మీర్జా పూర్ సీజన్ 3 స్ట్రీమింగ్ కానుందని సమాచారం.. త్వరలోనే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించేందుకు మేకర్స్ సిద్ధం అవుతున్నట్లు తెలుస్తుంది.ఉత్తరప్రదేశ్‌లోని మీర్జాపూర్ నగరం నేపథ్యంలో క్రైమ్ అండ్ యాక్షన్ థ్రిల్లర్ గా మీర్జా పూర్ సిరీస్ తెరకెక్కింది. ఈ సిరీస్ లో పంకజ్ త్రిపాఠి, శ్వేతా త్రిపాఠి, దివ్యేందు శర్మ, అలీ ఫజల్, శ్రియ పిల్గోంగర్ మరియు హర్షిత గౌర్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు.
2018 నవంబరు 16న మీర్జాపూర్ మొదటి సీజన్ రిలీజ్ కాగా ఊహించని రీతిలో రెస్పాన్స్ అందుకుంది.. ఇండియాలో అత్యధిక వ్యూస్ సొంతం చేసుకున్న వెబ్ సిరీస్ లలో ఒకటిగా నిలిచింది. ఇక దానికి సీక్వెల్ గా 2020 అక్టోబరు 23న మీర్జాపూర్ రెండో సీజన్ స్ట్రీమింగ్ కు వచ్చేసింది. ఇది మొదటి పార్ట్‌కు మించి రెస్పాన్స్ తెచ్చుకుంది. దీంతో మీర్జాపూర్ మూడో సీజన్ కోసం ఓటీటీ ఆడియెన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.అయితే మీర్జాపూర్ సిరీస్ ఎంత పెద్ద హిట్ అయిందో అందులోని క్యారెక్టర్ల పేర్లు కూడా అంతే పాపులర్ అయ్యాయి .ముఖ్యంగా మున్నా భయ్యా, గుడ్డూ భయ్యా మరియు బబ్లూల పేర్లు బాగా వైరలయ్యాయి. అయితే ఈ సిరీస్ లో ఎక్కువగా హింస, రొమాన్స్ తో కూడిన సన్నివేశాలు ఉండడం మీర్జాపూర్ సిరీస్‌లో ప్రతికూలాంశంగా చెప్పొచ్చు. ఇక మొదటి సీజన్‌లో మున్నా కారణంగా గుడ్డూ, తన తమ్ముడు బబ్లూ మరియు భార్య శ్వేతలను కోల్పోతాడు.అదే రెండో సీజన్ లో మున్నాపై గుడ్డూ ఎలా రివేంజ్ తీర్చుకున్నాడో చూపించారు.ఇక మూడో పార్ట్ మరింత ఆసక్తికరంగా ఉండనున్నట్లు తెలుస్తోంది
Also Read
- Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
- Third Front: దేశంలో ‘‘థర్డ్ ఫ్రంట్’’.. కనిమొళి వరస భేటీలతో కొత్త చర్చ..
- Marital Rape: వైవాహిక అత్యాచారంపై సుప్రీంకోర్టు కీలక విచారణ.. తెగే పంచాయితీనేనా?
- Pakistan: అరేబియా సముద్రంలో భారత్-పాక్ నేవీ ఢీ.. చైనా వ్యూహాలపై అనుమానం.!
తాజావార్తలు
-
OTR : అనకాపల్లి జిల్లాలో సీఎం రమేష్ వర్సెస్ గుడివాడ అమర్నాథ్
-
Story Board : డీలిమిటేషన్ పై కేంద్రం వ్యూహమేంటి..? తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది..?
-
CM Revanth Reddy :హైదరాబాద్‌లో హార్వర్డ్ కోర్సులు.. డిసెంబర్ నుంచే క్లాసులు
-
Telangana SIR : ఓటర్లకు ఈసీ గుడ్‌న్యూస్.. నోటీసులకు ఇక ఇలా స్పందించొచ్చు
-
Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!