Mirzapur 3 : మీర్జాపుర్ సీజన్ 3 రిలీజ్ డేట్ ఫిక్స్..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఓటీటీ ప్రేక్షకులకు క్రైమ్ అండ్ థ్రిల్లర్ యాక్షన్ వెబ్ సిరీస్ లు తెగ నచ్చేస్తుంటాయి..అలాంటి జోనర్ లో వచ్చిన వెబ్ సిరీస్ ‘మీర్జాపూర్’..పంక్ త్రిపాఠి, దివ్యేందు శర్మ, అలీ ఫజల్ మరియు శ్వేత త్రిపాఠి కీలక పాత్రల్లో నటించిన ఈ వెబ్ సిరీస్‌ను కరణ్ అన్షుమన్ మరియు గుర్మీత్ సింగ్‌లు తెరకెక్కించారు.ఇప్పటికే ‘మీర్జాపూర్ సీజన్ 1 అండ్ సీజన్ 2 విడుదల అయి రికార్డు స్థాయి లో వ్యూవర్ షిప్ సాధించాయి… దీంతో ఓటీటీ లో మోస్ట్ పాపులర్ ఇండియన్ వెబ్ సిరీస్ గా మీర్జాపూర్ నిలిచింది.మీర్జాపూర్ తొలి సీజన్ 2018 నవంబరు 16 న విడుదలైంది.మొదటి సీజన్ కు అద్భుత స్పందన లభించింది. దానికి కొనసాగింపు గా 2020 అక్టోబరు 23 న రెండో సీజన్ కూడా విడుదలైంది.. రెండవ సీజన్ కూడా అదిరిపోయే రెస్పాన్స్ అందుకుంది.అయితే, మీర్జాపూర్ 3 వ సీజన్ కూడా విడుదలకు సిద్ధమవుతోంది.
మూడో సీజన్ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తి గా ఎదురుచూస్తున్నారు. దానిపై తాజాగా ఓ అప్‌డేట్ వచ్చింది. ‘మీర్జాపూర్ సీజన్ 3’ ఓటిటి రిలీజ్ డేట్ త్వరలోనే తెలియజేయనున్నట్లు అమేజాన్ ప్రకటించింది. తాజాగా అందుతున్న సమాచారం మేరకు క్రిస్మస్ లేదా న్యూ ఇయర్ కానుక గా …ఈ సీరిస్ స్ట్రీమింగ్ అవుతుందని తెలుస్తోంది. ఈ వార్త బాలీవుడ్ మీడియా లో బాగా ప్రచారం జరుగుతోంది. కానీ అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇంకా రాలేదు..తొలి సీజన్ లో గుడ్డు(అలీ ఫజల్) తన తమ్ముడు బబ్లూ(విక్రాంత్), భార్య శ్వేత(శ్రియ పిల్గోంకర్)లను మున్నా(దివ్యేందు శర్మ) ఎలా నాశనం చేశాడన్న కథ తో సాగింది. రెండో సీజన్ లో గుడ్డు తన ప్రతీకారం ఎలా తీర్చుకున్నాడన్న దాన్ని ఈ సిరీస్ లో చూపించారు.ఈ సిరీస్ ను గుర్మీత్ సింగ్, మిహిర్ దేశాయ్ లు తెరకెక్కించారు. ఎక్సెల్ మీడియా ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై రితేశ్ సిద్వానీ నిర్మించారు.
Also Read
- SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
- Chairman's Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
- Vaibhav Sooryavanshi: అలా అయితే వైభవ్‌కు చోటు కష్టమే..? మాజీ క్రికెటర్ ఆసక్తికర విశ్లేషణ
- Off The Record: తూర్పు గోదావరిలో కూటమికి తిప్పలు... సీట్లు దక్కేదెవరికి...?
- Tags
- Mirzapur
- OTT Release
- season 3
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?