తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా పండిస్తున్న పంటలలో మిరప కూడా ఒకటి.. వీటిని వాణిజ్య పంటగా పండిస్తున్నారు.. అధిక దిగుబడి రావాలంటే తెగుళ్ల నుంచి పంటను ఎప్పటికప్పుడు సంరక్షిస్తూ ఉండాలి.. ముఖ్యంగా మిరపలో ఆకు మాడు తెగులు అనేది పంటకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తుంది.. ఒక ఫంగస్ వల్ల సోకుతుంది. ఈ ఫంగస్ పంట అవశేషాలపై చాలా రోజుల వరకు జీవించి ఉంటుంది. అందుకే ఈ తెగులు సోకితే వెంటనే గుర్తించి తగిన నివారణ చర్యలు తీసుకోవడం మంచిది..
ఈ మొక్క యొక్క ఆకులు నేలను తాకి కలుషితం అయితే ఈ తెగులు సంక్రమించే అవకాశం ఉంది.వాతావరణం లో ఉష్ణోగ్రత 24 నుండి 29 డిగ్రీల మధ్య ఉంటే,భూమి లో అధిక తేమ ఉంటే ఈ ఫంగస్ త్వరగా వృద్ధి చెందుతుంది.. గాలి, వర్షం ద్వారా కూడా ఈ ఫంగస్ త్వరగా వ్యాప్తి చెందుతుంది. అందుకే వర్షాకాలంలో ఈ పంట తీవ్ర నష్టాన్ని కలిగిస్తుంది.. మిరప యొక్క ముదురు ఆకులు, కాండం, లేతమిరపకాయలపై ఈ తెగుళ్ళ లక్షణాలను గమనించవచ్చు.మిరప ఆకులపై బూడిద రంగునుండి గోధుమ రంగు మచ్చలు ఏర్పడతాయి.మధ్య భాగంలో బుల్స్ ఐ రూపంలో మచ్చలు ఏర్పడతాయి..
ఈ మచ్చల చుట్టూ కాంతివంతమైన పసుపు వలయాలు ఏర్పడతాయి. తర్వాత మొక్కల యొక్క ఆకులు చాలా వరకు రాలిపోయే అవకాశం ఉంటుంది.. మిరప పంట నుండి ఈ తెగులను అరికట్టాలంటే. తెగులు నిరోధక విత్తనాలను ఎంపిక చేసుకొని సాగు చేయాలి. పొలంలో డ్రైనేజీ సదుపాయం మెరుగ్గా ఉండేటట్లు చూసుకోవాలి. గాలి వీచే దశను బట్టి మొక్కల వరుసలను నాటుకోవాలి. మొక్కల మధ్య, సాల్ల మధ్య కాస్త అధిక దూరం ఉండేటట్లు నాటుకోవాలి. ఆకులకు తడి తగలకుండా డ్రిప్ విధానం లో నీటిని అందించాలి.. అయితే ఇక్కడ రాత్రి పూట కాకుండా పగటి పూట మాత్రమే మొక్కలకు నీటిని అందించాలి.. రాత్రి ఎందుకంటే ఫంగస్ వేగంగా వ్యాప్తి చెందుతుంది.. ఇంకా ఏదైనా సమస్యల గురించి తెలుసుకోవాలంటే వ్యవసాయ నిపుణుల సలహా తీసుకోవడం మంచిది..