Commonwealth Games 2026: కామన్వెల్త్ క్రీడల్లో భారత్‌కు తొలి స్వర్ణం.. చరిత్ర స్పష్టించిన మీరాబాయి చాను..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కామన్వెల్త్ గేమ్స్‌లో భారత స్టార్ వెయిట్‌లిఫ్టర్ మీరాబాయి చాను మరోసారి తన అసాధారణ ప్రతిభతో దేశ కీర్తిపతాకాన్ని ఎగరవేసింది. 2026 కామన్వెల్త్ గేమ్స్‌లో భాగంగా మహిళల 48 కిలోల విభాగంలో ఆమె మొత్తం 190 కిలోల బరువును ఎత్తి సగర్వంగా స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. ఈ అద్భుత విజయంతో 2026 పోటీల్లో భారత్‌కు తొలి పసిడి పతకాన్ని అందించడమే కాకుండా, కామన్వెల్త్ గేమ్స్ చరిత్రలో వరుసగా మూడోసారి గోల్డ్ మెడల్ సాధించి హ్యాట్రిక్ రికార్డును నెలకొల్పింది. అంతకుముందు 2018 గోల్డ్ కోస్ట్ , 2022 బర్మింగ్‌హామ్ పోటీల్లో స్వర్ణాలు సాధించిన మీరాబాయి, ఈ విజయంతో కామన్వెల్త్ క్రీడల్లో తన వరుస ఆధిపత్యాన్ని చాటుతూ హ్యాట్రిక్ కొట్టింది.
మహిళల 48 కిలోల కేటగిరీ పోటీల్లో 31 ఏళ్ల మీరాబాయి అత్యంత ఆకట్టుకునే ప్రదర్శన ఇచ్చింది. స్నాచ్ విభాగంలో తొలి ప్రయత్నంలో 82 కిలోలు ఎత్తడంలో విఫలమైనప్పటికీ, ఆ తర్వాత పుంజుకుని మూడో ప్రయత్నంలో 85 కిలోల బరువును విజయవంతంగా ఎత్తి కామన్వెల్త్ గేమ్స్ కొత్త రికార్డును నమోదు చేసింది. అనంతరం క్లీన్ అండ్ జెర్క్ విభాగంలో తొలి ప్రయత్నం విఫలమైనా, రెండో ప్రయత్నంలో 105 కిలోలను ఎత్తి పసిడి పతకాన్ని ఖాయం చేసుకుంది. బంగారం ఖాయమవ్వడంతో మూడో ప్రయత్నానికి వెళ్లకుండానే విజయాన్ని జరుపుకుంది. ఈ పోటీలో నైజీరియాకు చెందిన రూత్ అసుక్వో న్యాంగ్ వెండి పతకం సాధించగా, మలేషియాకు చెందిన ఐరీన్ జేన్ హెన్రీ కాంస్య పతకాన్ని గెలుచుకుంది.
Also Read
- Instant Dosa Recipes: పులియబెట్టే పని లేకుండా.. అప్పటికప్పుడు నోరూరించే వివిధ రకాల దోశలు ఇలా సింపుల్‌గా చేయండి ఇలా..!
- Gautam Gambhir: "ఇదో చెత్త మ్యాచ్.. ఆ రికార్డులు ఎవరికి కావాలి?".. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఫైర్..
- 8,000mAh బ్యాటరీ, Full HD+ AMOLED డిస్ప్లేతో Oppo K15s, K15x లాంచ్.. ధర ఎంతంటే.?
- LPG e-KYC: ముగిసిన ఆఖరి గడువు.. ఎల్పీజీ ఇ-కేవైసీ చేయని వాళ్లకు గ్యాస్ వస్తుందా? క్లారిటీ ఇదిగో..
కామన్వెల్త్ గేమ్స్ చరిత్రను పరిశీలిస్తే మీరాబాయి చాను భారత్‌కు అత్యంత విజయవంతమైన అథ్లెట్లలో ఒకరిగా నిలిచింది. 2014 గ్లాస్గో క్రీడల్లో రజత పతకంతో తన ప్రయాణాన్ని ప్రారంభించిన ఆమె, ఆ తర్వాత 2018, 2022, 2026 క్రీడల్లో వరుసగా మూడు స్వర్ణ పతకాలను సాధించింది. దీంతో కామన్వెల్త్ క్రీడల్లో ఆమె సాధించిన మొత్తం పతకాల సంఖ్య నాలుగుకు (3 స్వర్ణాలు, 1 రజతం) చేరింది. కామన్వెల్త్ పతకాలతో పాటు ఒలింపిక్స్‌లో రజతం, ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లలో ఒక స్వర్ణం, రెండు రజతాలు సాధించిన మీరాబాయి చాను సాధించిన ఈ హ్యాట్రిక్ విజయంపై దేశవ్యాప్తంగా క్రీడాభిమానులు, ప్రముఖుల నుంచి ప్రశంసల వర్షం కురుస్తోంది.
తాజావార్తలు
-
JioBharat 4G Phone: రూ.299కే JioBharat 4G ఫోన్?.. జియో 10వ యానివర్సరీ ఆఫర్ ఇదే!
-
Instant Dosa Recipes: పులియబెట్టే పని లేకుండా.. అప్పటికప్పుడు నోరూరించే వివిధ రకాల దోశలు ఇలా సింపుల్‌గా చేయండి ఇలా..!
-
Gautam Gambhir: “ఇదో చెత్త మ్యాచ్.. ఆ రికార్డులు ఎవరికి కావాలి?”.. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఫైర్..
-
Rohit Sharma Celebration: అది నా కోసం మాత్రమే, నేను చెప్పను.. జాగింగ్ సెలబ్రేషన్స్‌పై రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Anakapalli: సినిమా డైరెక్ట్ చేయడం కన్నా.. దాన్ని నిర్మించి రిలీజ్ చేయడమే మహా కష్టం! డైరెక్టర్ త్రినాథరావు నక్కిన షాకింగ్ కామెంట్స్!
ట్రెండింగ్
-
8,000mAh బ్యాటరీ, Full HD+ AMOLED డిస్ప్లేతో Oppo K15s, K15x లాంచ్.. ధర ఎంతంటే.?
-
భారీ బ్యాటరీ, ఇమర్సివ్ డిస్ప్లేతో అక్టోబర్ 6న Vivo S2 FE లాంచ్‌కు రెడీ..!
-
POCO Big Billion Days Sale 2026: రూ.11,999 నుంచే స్మార్ట్ఫోన్లు.. X8 సిరీస్‌పై భారీ డిస్కౌంట్లు.!
-
1,600 నిట్స్ డిస్ప్లే, 3nm చిప్సెట్, Galaxy AI ఫీచర్లతో Samsung Galaxy Tab S12 సిరీస్ లాంచ్..!
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!