Site icon NTV Telugu

Frog Curry : కప్పకూర తిన్న కుటుంబం.. కక్కుకుని చనిపోయిన బాలిక

Frog

Frog

Frog Curry : చైనాలో జనాలు ఏది పడితే అది తింటారు.. కాబట్టే వాళ్లకు ఇన్ని రోగాలని ఆడిపోసుకునే వారు ఉన్నారు. కప్పలు, పిల్లులు, ఎలుకలు ముంగిసలు.. దేన్ని వదలరంటూ మనోళ్లు సరదాగా మాట్లాడుకుంటారు. నిజానికి మనదేశంలో కూడా అలాంటివి తిని అరాయించుకునేవాళ్లు చాలా మందే ఉన్నారు. కొన్ని తెగలు, నిరుపేదలు వీటిని తింటుంటారు. అందులో కొన్ని సార్లు విషాదాలు చోటుచేసుకున్న ఘటనలు ఉన్నాయి. తాజాగా ఇలాంటి ఘటనే ఒడిశాలో జరిగింది. ఇంట్లోకి వచ్చిన కప్పను కోసుకుని తిన్న కుటుంబంలో ఒక బాలిక చనిపోగా, మరో బాలిక ఆస్పత్రిపాలైంది.

Read Also: Parking Bikes Theft: పార్కింగ్ లో బైక్ పెడితే అంతే సంగతులు.. ఘరానా దొంగ అరెస్ట్

ఒడిశాలోని కియోంజర్ జిల్లాలోని బోడా బ్లాక్‌కు చెందిన మున్నాముండా అనే గిరిజనుడి ఇంట్లోకి ఓ కప్ప వచ్చింది. మున్నా దాన్ని వండి కూర చేశాడు. ఇంట్లో అందరూ తిన్నారు. మున్నా కూతురు ఆరేళ్ల సుమిత్ర ఆ కూరతో అనారోగ్యం బారినపడి చనిపోయింది. మరో కూతురు నాలుగేళ్ల మున్నీ తీవ్ర అస్వస్థతకు గురికాగా వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పారు. కప్ప కూర తిన్న పెద్దలకు ఏమీ కాలేదు. పిల్లలకు రోగనిరోధక శక్తి తక్కువ కావడం దుష్ప్రభావం చూపిందని అధికారులు చెప్పారు. కొన్ని రకాల కప్పల్లో శత్రువుల నుంచి రక్షించుకోడానికి విషం ఉంటుందని మున్నా కుటుంబం అలాంటి కప్పనే వండుకుని ఉంటుందని చెబుతున్నారు. కప్పల చర్మపై విషగ్రంధులు ఉంటాయని గిరిజనులు జాగ్రత్తగా ఉండాలని వీఎస్‌ఎస్ మెడికల్ సైన్స్ అండ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌ ప్రొఫెసర్ సంజీబ్ మిశ్రా తెలిపారు.

Read Also: TSRTC: మహా శివరాత్రికి 2,427 స్పెషల్ బస్సులు

Exit mobile version