Site icon NTV Telugu

Human SacriFice: దారుణం.. డబ్బుపై ఆశతో బాలుడు నరబలి.. పిల్లాడి తలనరికి..

Human Sacrifice

Human Sacrifice

Human SacriFice: కేంద్ర పాలిత ప్రాంతమైన దాద్రా నగర్‌ హవేలీలోని సిల్వాస్సాలో నరబలి ఉదంతం తెరపైకి వచ్చింది. ధనవంతులు కావాలనే ఆశతో తొమ్మిదేళ్ల బాలుడిని కిడ్నాప్‌ చేసి, ఆపై నరబలి ఇచ్చారు. ఆపై మృతదేహాన్ని ముక్కలు చేశారు. ఈ దారుణ ఘటనలో మైనర్‌తో సహా ముగ్గురిని పోలీసులు బుధవారం అరెస్ట్‌ చేశారు. నరబలి ఇస్తే డబ్బులు వస్తాయన్న మూఢనమ్మకంతో.. లోకజ్ఞానం కూడా తెలియని తొమ్మిదేళ్ల చిన్న పిల్లాడిని కొందరు దుండగులు తలనరికి చంపేశారు. 9 ఏళ్ల బాలుడిని కిడ్నాప్‌ చేసి.. ఆపై తలనరికి చంపినట్లు పోలీసులు బుధవారం తెలిపారు. అనంతరం నిందితులు మృతదేహాన్ని ముక్కలు చేయగా.. మృతుడి శరీర భాగాల కోసం పోలీసులు గాలింపు చర్యలు ప్రారంభించారు. ఈ క్రూరమైన నేరంపై దర్యాప్తు చేస్తున్నామని పోలీసు అధికారి వెల్లడించారు.

పొరుగున ఉన్న గుజరాత్‌లోని వల్సాద్ జిల్లాలోని వాపిలో కాలువ సమీపంలో తల నరికిన మృతదేహం లభించడంతో పోలీసులు గత వారం విచారణ ప్రారంభించినట్లు సమాచారం. ఈ క్రమంలో ఇద్దరు వ్యక్తులతో పాటు మరో మైనర్‌ను అదుపులోకి తీసుకున్నారు. దాద్రానగర్​ హవేలీలోని సైలీ గ్రామానికి చెందిన బాలుడు.. డిసెంబర్ 29 నుంచి కనిపించకుండా పోయాడు. అతడి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో సిల్వాస్సా పోలీసులు మిస్సింగ్ కేసును నమోదు చేశారు. ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. సిల్వాస్సాకు 30 కిలోమీటర్ల దూరంలో గుజరాత్​లోని వాపిలో కాలువలో తల లేని శరీరాన్ని పోలీసులు గుర్తించారు. ఆ మృతదేహం.. దాద్రానగర్​ హవేలీలో అదృశ్యమైన బాలుడిదే అని అనుమానించారు. శరీర భాగాలను ఫోరెన్సిక్ పరీక్షకు పంపించారు. దర్యాప్తులో భాగంగా ఒక బాలుడ్ని పోలీసులు పట్టుకున్నారు. అతడిని విచారించగా అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి.

Land Dispute: భగ్గుమన్న భూవివాదం.. పరస్పర కాల్పుల్లో ముగ్గురు దుర్మరణం

గుజరాత్‌లోని తాపీ జిల్లా కప్రదా తాలూకాలోని కర్జన్ గ్రామానికి చెందిన బాలుడు.. సైలీ గ్రామంలోని చికెన్ దుకాణంలో పని చేస్తున్నాడు. అతడిని పట్టుకుని ఆరా తీస్తే.. డిసెంబర్ 29న సైలీ గ్రామం నుంచి తొమ్మిదేళ్ల బాలుడిని కిడ్నాప్​ చేశారని తెలిసింది. నరబలి ఇస్తే డబ్బులు వస్తాయనే ఆశతో అతడ్ని నరబలి ఇచ్చారని తెలిసింది. పోలీసులకు పట్టుబడిన బాలుడితో పాటు శైలేష్​ కోహేర్కా, రమేష్ సన్వార్ అనే వ్యక్తులు కలిసి ఈ ఘోరానికి పాల్పడ్డారు. నరబలి ఇస్తే డబ్బు వస్తుందని శైలేష్​ కోహేర్కా బాలుడి తల నరికేయాలని ప్రేరేపించగా.. అందరూ కలిసి బాలుడిని అతి కిరాతకంగా నరికేశారు.

Exit mobile version