Minister Mahender Reddy: కేసీఆర్ ప్రభుత్వం అందరి ప్రభుత్వం.. సంక్షేమ పథకాల్లో దూసుకుపోతున్నాం
చేవెళ్లలో వెనుకబడిన తరగతుల శాఖ ఆధ్వర్యంలో బీసీ కులాల చేతివృత్తుల లబ్ధిదారులకు అందించే బీసీ బందు కార్యక్రమాన్ని మంత్రులు పట్నం మహేందర్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మండలి వైస్ చైర్మన్ బండ ప్రకాష్, ఎమ్మెల్యే కాలే యాదయ్య తదితరులు పాల్గొన్నారు. అనంతరం లబ్ధిదారులకు మంత్రులు మహేందర్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ చెక్కులను పంపిణీ చేసారు.
Read Also: TS DSC : 5089 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతి..
Also Read
- Land Rates: ORR-RRR మధ్య చైనా తరహా పార్కులు.. మే 1 నుంచే తెలంగాణలో భూమి ధరలు పెంపు..
- PM Modi: మే 4 తర్వాత బెంగాల్లో మాఫియా, గుండాల అంతం ఖాయం..
- NoiseFit Diva Araya: నాయిస్ ఫిట్ దివా అరయా.. మహిళలకు స్టైలిష్ స్మార్ట్‌వాచ్.. లైవ్ లొకేషన్ ట్రాకింగ్ కూడా
- Iran War: ఇరాన్ దెబ్బకు అమెరికాకు బిలియన్ డాలర్ల నష్టం..
అనంతరం మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం అందరి ప్రభుత్వం అని అన్నారు. ప్రతి ఒక్కరి సంక్షేమం కోరే పార్టీగా బీఆర్ఎస్ ముందుకు సాగుతుందని చెప్పారు. సీఎం కేసీఆర్ ప్రపంచంలోనే ఎక్కడలేని విధంగా రాష్ట్రంలో సంక్షేమ పథకాలను అమలుపరుస్తూ దేశానికి మార్గదర్శకత్వం వహిస్తున్నారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు.
Read Also: Peddireddy Ramachandra Reddy: ఏపీలో కంచుకోట లేమి లేవు.. రాష్ట్రమంతా సీఎం జగన్ కంచుకోటే..
తొలి విడత ప్రతిగా రంగారెడ్డి జిల్లాలోని ప్రతి నియోజకవర్గానికి 300 చొప్పున.. రంగారెడ్డి జిల్లాలో 2100 మంది లబ్ధిదారులకు 21 కోట్లతో పథకం వర్తిస్తుందని మంత్రి మహేందర్ రెడ్డి చెప్పారు. చేవెళ్ల నియోజకవర్గంలో 300 మంది లబ్ధిదారులకు మూడు కోట్లు అందిస్తున్నట్లు వెల్లడించారు. సీఎం కేసీఆర్ దేశంలో ఎక్కడ జరగని విధంగా పథకాలను అమలుపరుస్తున్నట్లు మహేందర్ రెడ్డి తెలిపారు. ప్రతి పథకం నిరంతర ప్రక్రియగా సాగుతాయని.. ఎవరు రాలేదని అసంతృప్తికి గురికారాదని, అందరికీ అర్హతలను బట్టి అందుతాయని మహేందర్ రెడ్డి వెల్లడించారు.
తాజావార్తలు
-
Land Rates: ORR-RRR మధ్య చైనా తరహా పార్కులు.. మే 1 నుంచే తెలంగాణలో భూమి ధరలు పెంపు..
-
PM Modi: మే 4 తర్వాత బెంగాల్లో మాఫియా, గుండాల అంతం ఖాయం..
-
Vizag ROB Collapse: విశాఖలో ప్రమాదం.. కూలిన నిర్మాణంలో ఉన్న రైల్వే బ్రిడ్జి
-
Payal Rajput Lover హీరోగా సినిమా.. ఆరోజే రిలీజ్
-
NoiseFit Diva Araya: నాయిస్ ఫిట్ దివా అరయా.. మహిళలకు స్టైలిష్ స్మార్ట్‌వాచ్.. లైవ్ లొకేషన్ ట్రాకింగ్ కూడా
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!