NTV Telugu Site icon

AP Cabinet Reshuffle: కేబినెట్‌లో మార్పులు.. ఇలా స్పందించిన రోజా, అంబటి

Ambati Rambabu, Rk Roja

Ambati Rambabu, Rk Roja

AP Cabinet Reshuffle: మంత్రులు, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలు, నేతలతో సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి సమావేశం అవున్న సమయంలో.. కేబినెట్‌లో మార్పులు, చేర్పులపై జోరుగా చర్చ సాగుతోంది.. గడపగడపకు మన ప్రభుత్వం, ఇతర కార్యక్రమాలపై సీఎం వైఎస్‌ జగన్‌ సమీక్ష నిర్వహిస్తున్నారని పార్టీ నేతలు చెబుతున్నా.. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల తర్వాత జరుగుతోన్న ఈ సమయంలో.. కీలక నిర్ణయాలు ఉంటాయనే ప్రచారం సాగుతోంది.. ఇక, ఆ ప్రచారంపై స్పందించిన మంత్రులు అంబటి రాంబాబు, ఆర్కే రోజా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Read Also: Pawan Kalyan Delhi Tour: ఢిల్లీలో జనసేనాని.. ఇద్దరు కీలక నేతలతో భేటీ..!

మంత్రివర్గంలో మార్పులు అన్నది మీడియా ప్రచారం మాత్రమేనంటూ కొట్టిపారేశారు మంత్రి అంబటి రాంబాబు.. మీడియాకి కూడా రేటింగ్ కావాలి కాబట్టి ప్రచారాలు చేస్తాయన్న ఆయన.. సీఎం వైఎస్‌ జగన్‌ స్ట్రెయిట్ రాజకీయాలు చేసే వ్యక్తి.. ఎమ్మెల్యేలు గెలిచే అవకాశం లేదంటే టికెట్ ఇవ్వలేను అని ముందే చెప్పేస్తారన్నారు.. చివరి వరకు ఆశల్లో పెట్టి మోసం చేసే తత్వం జగన్‌ను కాదన్న ఆయన.. ఈ నెల 7వ తేదీ నుంచి జగనన్నే మా నమ్మకం కార్యక్రమం ప్రారంభం అవుతుంది.. దానికి సంబంధించి కూడా ఈ సమావేశంలో వివరిస్తారని తెలిపారు.

ఇక, ప్రజలకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమం, అభివృద్ధి సక్రమంగా అందుతున్నాయా..? లేదా..? చూసేందుకు గడప గడపకు మన ప్రభుత్వం చేస్తున్నాం. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ రావడం, అసెంబ్లీ జరగడంతో బ్రేక్ వచ్చిందన్నారు మంత్రి ఆర్కే రోజా.. భవిష్యత్ కార్యాచరణ కోసం ఈ రోజు సీఎం జగన్ సమావేశం ఏర్పాటు చేశారు. నాకు తెలిసినంతవరకూ మంత్రివర్గంలో మార్పులు ఉండబోవని స్పష్టం చేశారు. మంత్రులందరూ బాగానే పని చేస్తున్నారని తెలిపారు.. మమ్మల్ని మేం నిరూపించుకోవడానికి మంత్రి పదవులు వచ్చి ఏడాదే అయ్యిందన్నారు మంత్రి ఆర్కే రోజా. కాగా, తాడేపల్లిలోని క్యాంప్‌ కార్యాలయం వేదికగా ఇప్పటికే మంత్రులు, ఎమ్మెల్యేలు, రీజినల్‌ కోఆర్డినేటర్లు, సీనియర్‌ నేతలతో సమావేశం అయ్యారు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌.

Show comments