Site icon NTV Telugu

Harish Rao : కేంద్రం నిధుల విడుదల చేయకపోయినా సంక్షేమం ఆపలేదు

Harish Rao

Harish Rao

నల్లగొండ జిల్లాలోని మర్రిగూడలో ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు పర్యటించారు. మునుగోడు నియోజకవర్గం మర్రిగూడలో 30 పడకల సిహెచ్‌సి ఆసుపత్రిని ప్రారంభించిన అనంతరం సభలో ప్రసంగించారు. నల్లగొండ జిల్లాలో ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాలు తగ్గడంపై మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర సరాసరి కంటే తక్కువ సరాసరి నల్లగొండ జిల్లాలో నమోదు కావడంపై డీఎంహెచ్‌వోపై మంత్రి మండిపడ్డారు.
Also Read : Nandamuri Balakrishna: పవన్ ఎపిసోడ్ కు ముందు ట్విస్ట్ ఇచ్చిన బాలయ్య
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాలు పెరగాలని సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా సిజేరియన్ ఆపరేషన్‌లు పెరగడం ఆందోళన కలిగిస్తుందన్నారు. ఒక జిల్లాకు రెండు మెడికల్ కాలేజీలు ఇచ్చిన ఘనత కేసీఆర్, బీఆర్‌ఎస్‌లదేనన్నారు మంత్రి హరీష్‌ రావు. శివన్న గూడెం, చర్ల గూడెం, లక్ష్మణపురం ప్రాజెక్ట్ భూ నిర్వాసితుల సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామన్నారు. కేంద్రం నిధుల విడుదల చేయకపోయినా సంక్షేమం ఆపలేదన్నారు. కేంద్రం నుండి రావలసిన నిధులు సకాలంలో రావడం లేదని ఆయన వెల్లడించారు. సంక్రాంతి తరువాత రాష్ట్ర వ్యాప్తంగా కంటి వెలుగు కార్యక్రమం ప్రారంభం అవుతుందని ఆయన పేర్కొన్నారు.
Also Read : Pragathi: ప్రగతి రెండో పెళ్లి.. 20ఏళ్ల వయసులో ఉంటే..?

కేంద్రం, దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాలు తెలంగాణలో అమలు అవుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తున్నాయన్నారు. మునుగోడు ఉప ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను అన్ని అమలు చేస్తామని ఆయన స్పష్టం చేశారు. ప్రజలు మెరుగైన వైద్య సేవలందించాలని సూచించారు. ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే అవగాహన కల్పించాలన్నారు. కార్పొరేట్‌ ఆసుపత్రులకు ధీటుగా తెలంగాణ ప్రభుత్వ ఆసుపత్రులు తీర్చిదిద్దామన్నారు. ఇంకా మరింత అధునాతన టెక్నాలజీతో కూడి పరికరాలను ప్రభుత్వ ఆసుపత్రుల్లో తీసుకువస్తామన్నారు.

Exit mobile version