Site icon NTV Telugu

Minister Vasamsetti Subhash: లోకేష్‌తో జగన్ పది నిమిషాలు డిబేట్‌లో కూర్చోగలరా..?

Vasamsetti Subhash

Vasamsetti Subhash

వైసీపీ నేతలకు వైసీపీ పార్టీ మొదటి వర్ధంతి శుభాకాంక్షలు అంటూ మంత్రి వాసంశెట్టి సుభాష్ ఎద్దేవా చేశారు. జగన్ వ్యాఖ్యలపై మంత్రి స్పందించారు. జగన్ బ్రతుకే వెన్నుపోటుతో ప్రారంభించారన్నారు. కొండా సురేఖను జగన్‌ పట్టించుకోలేదని.. వెన్నుపోటుదారుడుగా ప్రత్యేక‌ స్థానం జగన్ కే సొంతం అని విమర్శించారు.. చెల్లిని, తల్లిని అధికారంలోకి రాగానే బయటకు గెంటేయడం వెన్నుపోటు కాదా? అని ప్రశ్నించారు. బుడమేరు ఏంటనేది కూడా తెలీకుండా అపహాస్యం పాలయ్యారని.. వైసీపీ బ్యానర్ వివాదం పై రామచంద్రాపురంలో కంప్లైంట్ ఇచ్చామన్నారు. సెక్షన్ 505, 504 ల గురించి తెలీదా… బ్యానర్ వెంటనే తీయకపోతే.. శిక్షకు గురౌతారని చెప్పారు.. ఎస్సీ, ఎస్టీ పధకాలు తీసేసి బడుగు బలహీన వర్గాల వెన్నుపోటుదారుడు జగన్ కాదా? కల్తీ మద్యాన్ని అందించి ప్రజల ప్రాణాలతో ఆడుకోవడం నిజం కాదా? అని విమర్శించారు.

READ MORE: IPL 2025 Final: వర్షం కారణంగా ఫైనల్ రద్దయితే.. నెక్స్ట్ ఏంటి..? రిజర్వ్ డే ఉందా..?

గత ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసిందని.. శవ రాజకీయాలు, డైవర్షన్ పాలిటిక్స్ వైసీపీ కి వెన్నతో పెట్టిన విద్య అంటూ మంత్రి వాసం శెట్టి సుభాష్ ఆరోపించారు. లోకేష్ తో పది నిమిషాలు జగన్ డిబేట్ లో కూర్చోగలరా? డిబేట్ లో జగన్ కు ఉన్న నాలెడ్జ్ ఎంతో తేలిపోతుందన్నారు. విజయసాయి రెడ్డి వైసీపీ నుంచి వచ్చి అప్రూవర్ గా మారరని.. వైసీపీ ఇంఛార్జ్ లు, కార్యకర్తలకు అనవసరపు బ్యానర్లు పెట్టి శిక్షల పాలవ్వద్దని విన్నవించారు. భిక్షగాడి అవతారం ఎత్తి బాబ్బాబు అని అడుక్కుంటున్నారని.. జగన్ మానసిక స్ధితి బాగోలేదన్నారు.. తుని రైలు ఘటనపై గత ప్రభుత్వ హయాంలో కులాల మధ్య కుంపటి పెట్టారని ఆరోపించారు.

Exit mobile version