వైసీపీ నేతలకు వైసీపీ పార్టీ మొదటి వర్ధంతి శుభాకాంక్షలు అంటూ మంత్రి వాసంశెట్టి సుభాష్ ఎద్దేవా చేశారు. జగన్ వ్యాఖ్యలపై మంత్రి స్పందించారు. జగన్ బ్రతుకే వెన్నుపోటుతో ప్రారంభించారన్నారు. కొండా సురేఖను జగన్ పట్టించుకోలేదని.. వెన్నుపోటుదారుడుగా ప్రత్యేక స్థానం జగన్ కే సొంతం అని విమర్శించారు.. చెల్లిని, తల్లిని అధికారంలోకి రాగానే బయటకు గెంటేయడం వెన్నుపోటు కాదా? అని ప్రశ్నించారు.
గత ప్రభుత్వ హయాంలో ఈ-ఫార్ములా రేసు కోసం విదేశీ కంపెనీకి నిబంధనలతు విరుద్ధంగా నిధులు బదలాయించారన్న కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ-ఫార్ములా రేసు నిధుల బదలాయింపుపై విచారణకు గవర్నర్ ఆమోదం తెలిపారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం వెల్లడించింది. న్యాయనిపుణుల సలహాలు తీసుకుని గవర్నర్ ఆమోదం తెలిపారని.. సీఎస్ ద్వారా ఏసీబీకి లేఖ పంపుతామని ప్రభుత్వం పేర్కొంది.