NTV Telugu Site icon

Minister Uttam: సాంకేతిక కారణాలతో కాని వారికి త్వరలో రుణమాఫీ..

Uttam

Uttam

Minister Uttamkumar Reddy: డిసెంబర్‌లో రుణమాఫీ చేస్తామని చెప్పి జూలైలోనే రుణమాఫీ మొదలు పెట్టామని మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి వెల్లడించారు. సాంకేతిక కారణాలతో రుణమాఫీ కాని వారికి త్వరలో రుణమాఫీ చేస్తామన్నారు. లక్షా 20 వేల మంది రైతులు ఆధార్ నంబర్లు తప్పుగా ఇచ్చారని.. లక్షా 61 వేల రైతుల ఆధార్ కార్డుల్లో, అకౌంట్స్‌లో పేర్లు తప్పులు ఉన్నాయన్నారు. 4 లక్షల 83 వేల మందికి రేషన్ కార్డుల్లో తప్పులు ఉన్నాయని పేర్కొన్నారు. 8 లక్షల అకౌంట్స్ రెండు లక్షల కంటే ఎక్కువ రుణం తీసుకున్నారని.. 2 లక్షల కంటే ఎక్కువ ఉన్న వారు పై అమౌంట్ కడితే వెంటనే రుణమాఫీ అవుతుందన్నారు. నాడు బీఆర్‌ఎస్ రుణమాఫీ టోటల్ ఫెయిల్యూర్‌ అని.. నాడు కేసీఆర్ చేసిన రుణమాఫీ రైతుల బ్యాంకు వడ్డీలకే సరిపోయిందని మంత్రి విమర్శించారు.

Read Also: CM Revanth Reddy: తల్లి అంత్యక్రియలకు చిన్నారి భిక్షాట‌న.. స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి

రాష్ట్రంలో ప్రతిపక్షాలు ఒక తప్పుడు వాదనతో రైతుల్లో ఆందోళన కలుగజేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసినట్లుగా దేశంలో ఎక్కడా, ఎప్పుడు, ఏ రాష్ట్రం రైతులకు రుణమాఫీ చేయలేదన్నారు. పార్లమెంట్‌లో వ్యవసాయం గురించి అనేక అంశాలపై మాట్లాడానని.. బీజేపీ రైతు రుణమాఫీ గురించి ఎప్పుడూ మాట్లాడలేదన్నారు. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని.. రైతుల మేలు కోసం ఒక్క స్టెప్ కూడా బీజేపీ తీసుకోలేదని మండిపడ్డారు. మన్మోహన్ సింగ్ సర్కారు రుణమాఫీ చేసి రైతులను రుణ విముక్తులను చేసిందన్నారు. తాము ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నామన్నారు. పంద్రాగస్టు నాటికి రుణమాఫీ చేశామని.. మిగిలిన వారికి కూడా రుణమాఫీ చేస్తామన్నారు. పంట నష్టం జరిగితే రైతులకు బీఆర్ఎస్ ఒక్క పైసా ఇవ్వలేదని.. నాడు అనేక ఆందోళనలు చేశామని మంత్రి తెలిపారు. ఈ పంట నుంచి సన్నాలకు 500 రూపాయల బోనస్ ఇవ్వనున్నామని పేర్కొన్నారు. రైతులకు పంట నష్టపరిహారం తాము అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇస్తున్నామని వెల్లడించారు.

Read Also: Heart Attack Video: డాక్టర్ పరీక్షిస్తుండగానే గుండెపోటుతో రోగి మృతి..

బీఆర్ఎస్ రైతులను మోసం చేసిందని. రైతుల జీవితాలను నాశనం చేసిందని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు తీసుకున్న రుణం + వడ్డీ మొత్తం మేము మాఫీ చేశామన్నారు. గతంలో ప్రజల ఆస్తి ఓఆర్ఆర్‌ను అమ్మి రుణమాఫీ చేశారని మంత్రి పేర్కొన్నారు. 2018లో రైతు రుణమాఫీలో అనేక ఫిర్యాదులు వస్తే వాటి పరిష్కారం కోసం ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆయన వెల్లడించారు. రైతులను మోసం చేయడం బీఆర్ఎస్‌కు అలవాటు అని.. అధికారంలో ఉన్నా లేకపోయినా బీఆర్ఎస్‌కు ఇది అలవాటేనంటూ ధ్వజమెత్తారు. రెండు లక్షల కంటే ఎక్కువగా రుణం ఉన్న వారు వెంటనే పైన డబ్బులు బ్యాంకులకు చెల్లిస్తే రుణమాఫీ అవుతుందన్నారు. మోసపూరిత బీఆర్ఎస్ నేతల మాటలు నమ్మవద్దంటూ వ్యాఖ్యానించారు. రైతుల జీవితాల్లో వెలుగులు నింపుతామన్నారు.