Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Minister Uttamkumar Reddy Comments On Kcr And Bjp

Minister Uttamkumar Reddy: పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్‌ఎస్ కనుమరుగు..

Published Date :April 3, 2024 , 5:36 pm
By Mahesh Jakki
Minister Uttamkumar Reddy: పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్‌ఎస్ కనుమరుగు..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Minister Uttamkumar Reddy: బీజేపీ మత రాజకీయాలు తప్ప రాష్ట్రాభివృద్ధికి చేసింది శూన్యమని మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి అన్నారు. పార్లమెంట్ ఎన్నికల తరువాత బీఆర్‌ఎస్‌ కనుమరుగు అవుతుందన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో లబ్ది పొందడం కోసం కేసీఆర్ అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని ఆయన తీవ్రంగా విమర్శించారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడారు. జనరేటర్‌తో ప్రెస్ మీట్‌లు పెట్టుకొని కరెంటు కట్ అయింది అంటూ కేసీఆర్ మాట్లాడటం సిగ్గుచేటన్నారు. ఫోన్ టాపింగ్ వ్యవహారంపై కేసీఆర్ కేటీఆర్ తెలంగాణ ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలన్నారు.

Read Also: KTR: ముఖ్యమంత్రి గుంపుమేస్త్రీ, ప్రధాని మంత్రి తాపీ మేస్త్రీ

అసలు కరువు మొదలైంది టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనేని.. కృష్ణా, గోదావరి జలాశయాల్లో నిల్వలు తక్కువగా ఉండటానికి కారణం కేసీఆర్ ధోరణి మాత్రమేనన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ధాన్యం సేకరణ కోసం 7149 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ 14 స్థానాల్లో విజయం సాధిస్తుందని మంత్రి చెప్పుకొచ్చారు. దేశంలో బీజేపీని ఓడిస్తేనే ప్రజాస్వామ్యం నిలబడుతుందన్నారు. సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణ విషయంలో కేటీఆర్ ఉచిత సలహాలు కాంగ్రెస్ ప్రభుత్వానికి అవసరం లేవని, కాంగ్రెస్ పార్టీలోనే నిష్ణాతులైన నాయకులు ఉన్నారని అన్నారు. 6వ తేదీన తుక్కుగూడలో జరిగే రాహుల్ గాంధీ బహిరంగ సభను విజయవంతం చేయాలన్నారు.

 

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • bjp
  • congress
  • kcr
  • Lok Sabha elections-2024
  • Minister Uttamkumar Reddy

తాజావార్తలు

  • Onion Rice Recipe: అమ్మల కష్టానికి ఫుల్ స్టాప్.. ఉదయాన్నే హడావిడి లేకుండా 10నిమిషాల్లో టేస్టీ, హెల్తీ లంచ్ బాక్స్ రెసిపీ..

  • 3 States Elections: 3 రాష్ట్రాల్లో ప్రశాంతంగా ఓటింగ్.. ఎంత పోలింగ్ నమోదైందంటే..!

  • AK64 : అజిత్ కుమార్ డబుల్ రోల్: అటు రేసింగ్.. ఇటు షూటింగ్!

  • Supreme Court: మహాభారతం పోరాటంలాగా ఉంది.. విడాకులిస్తూ సుప్రీంకోర్టు అసహనం

  • Home Minister Anitha: ‘మావిగన్’ పేరు ఎత్తితే జనం నవ్వుకుంటున్నారు.. అనిత సెటైర్లు

ట్రెండింగ్‌

  • Kitchen Tips : వేసవిలో కిచెన్ హీట్‌కు గుడ్‌బై..! ఈ సింపుల్ టిప్స్‌తో వంటగది కూల్‌గా మార్చుకోండి.!

  • Garlic Butter Chicken Recipe : ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ గార్లిక్ బటర్ చికెన్.. ఇలా సింపుల్‌గా తయారు చేయండి..!

  • Chemical Mangoes : జాగ్రత్త..! రసాయనాలతో పండించిన మామిడి పండ్లను ఇలా గుర్తించండి..!

  • Vitamin B1 Deficiency : గర్భిణీలలో విటమిన్ బి1 లోపం.. తల్లి, బిడ్డ ఆరోగ్యానికి పొంచి ఉన్న ముప్పు.!

  • స్టైలిష్ లుక్, స్ట్రాంగ్ బిల్డ్.. యూత్‌ టార్గెట్ గా OPPO F33 సిరీస్.. ఫీచర్స్ ఇవే..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions