NTV Telugu Site icon

Uttam Kumar Reddy: నీటి పారుదల శాఖలో పనులు అత్యంత పారదర్శకంగా ఉండాలి..

Uttam

Uttam

హైదరాబాద్ లోని జలసౌదలో తెలంగాణ రాష్ట్రంలోని సాగు నీటి ప్రాజెక్టుల పురోగతిపై నీటి పారుదల శాఖ ఉన్నతాధికారులతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పెండింగ్ ప్రాజెక్టులపై ఆరా తీశారు. ఎస్ఎల్బీసీ పనుల గురించి అధికారులను అడిగి మంత్రి తెలుసుకున్నారు. ఈ సమావేశంలో ప్రాజెక్టుల వారీగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ప్రాజెక్టులకు అవుతున్న విద్యుత్ వినియోగం.. కాళేశ్వరం, పాలమూరు- రంగారెడ్డి, సీతారామ ప్రాజెక్టు, ఎస్ఎల్బీసీ ప్రాజెక్టులపై మంత్రి లోతుగా సమీక్ష చేశారు. ఈ సమీక్షలో పాల్గొన్న ఈఎన్సీ మురళీధర్ తో పాటు ఉన్నతాధికారుల దగ్గర నుంచి పూర్తి వివరాలను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అడిగి తెలుసుకున్నారు.

Read Also: Shamshabad: ఎయిర్‌పోర్టులో భారీగా బంగారం పట్టివేత

ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. నీటి పారుదల శాఖలో పనులు అత్యంత పారదర్శకంగా ఉండాలి అని సూచించారు. ప్రజల డబ్బులతో మనం ప్రాజెక్టులను కడుతున్నాం.. మనం పూర్తిగా బాధ్యతాయుతంగా, జవాబు దారి తనంతో పని చేయాలి అని తెలిపారు. తెలంగాణలో నీటి పారుదల రంగానికి చాలా ప్రాధాన్యత ఉంది.. అది గుర్తు పెట్టుకొని మనం పని చేయాలి అని ఆయన పేర్కొన్నారు. నీటి పారుదల పనులలో మూడో పార్టీ చెక్ ఉండాలి.. ప్రజల్లో నీటి పారుదల రంగంపై ఉన్న అపోహలు తొలగిపోయేలా అందరు పని చేయాలి అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు.

Read Also: Article 370: ఆర్టికల్ 370పై సుప్రీంకోర్టు నిర్ణయంపై బీజేపీ నేతలు స్పందన ఇదే..!

మేడిగడ్డ ప్రాజెక్ట్ సందర్శనకు ప్లాన్ చెయ్యండి అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులకు తెలిపారు. ఇది చాల తీవ్రమైన అంశం.. ఈ మేడిగడ్డ నిర్మాణం చేసిన ఏజెన్సీని, అధికారులను వెంట ఉండేలా చుడండి.. అక్కడ ఖర్చు చేసింది ఎంత.. ఎంత ఆయకట్టుకు నీరిచ్చేందుకు నిర్మాణం జరిగింది.. ఒక్కో ఎకరా సాగుకు అవుతున్న ఖర్చు ఎంత అని అధికారులను ప్రశ్నించిన మంత్రి ఉత్తమ్.. మేడిగడ్డ ప్రాజెక్టు కుంగడంపై విచారణకు ఆదేశిస్తాం.. తప్పు చేసిన వారిపై చర్యలు తప్పవని స్పష్టం చేసిన మంత్రి.. పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్ట్ పై పూర్తి వివరాలు సిద్ధం చెయ్యండి.. ప్రత్యేకంగా సమీక్షా చేద్దాం అని ఆయన తెలిపారు. సీడ్యబ్లూసీ అనుమతి లేకుండా ప్రాజెక్టులు ఏ విధంగా నిర్మిస్తారని మంత్రి ప్రశ్నించారు. నిధులు ఎలా సమీకరించారు.. మీరు కడుతున్న ప్రాజెక్ట లను థర్డ్ పార్టీ చెకింగ్ లేదా అని ఆయన అడిగారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి సీడ్యబ్లూసీ అనుమతి ఉందని అధికారులు తెలిపారు. పాత ఆయకట్టును కూడా ఎందుకు కొత్త ఆయకట్టులో కలుపుతున్నారని మంత్రి ప్రశ్నించారు. వర్షం వచ్చినప్పుడు నీటిని లిఫ్ట్ చెయ్యాల్సిన అవసరం లేదని ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.

Read Also: Mangalagiri: తాడేపల్లికి మంగళగిరి పంచాయతీ.. తాజా పరిణామాలపై సీఎంతో నేతల భేటీ

నీటి పారుదల శాఖ పారదర్శకంగా పని చెయ్యాల్సి ఉంది అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. తెలంగాణ ప్రజలను మార్టిగేజ్ చేసి రుణాలు తెస్తున్నాం.. ఖర్చు పెడుతున్న మొత్తానికి లబ్ది చేకూరుతున్న వైనంపై బేరీజు చేసుకోవాలి.. ఇది వరకు నీటిపారుదల శాఖలో ఎదో జరిగిందని అనుమానాలు ఉన్నాయి.. వందేళ్లు ఉండాల్సిన ప్రాజెక్టు ఏడేళ్లకే దెబ్బతినడం ఆందోళన కరం.. ఎందుకు అలా జరగాల్సి వచ్చింది.. సమర్ధవంతంగా పనిచేయాలి.. ఇది అందరికి వర్తిస్తుంది.. అంచనాలు, టెండర్, నిర్మాణం ఇక్కడే జరుగుతున్న సమయంలో అంతర్గత అడిట్ ఉంటె మంచిది.. సాగు నీటి విషయంలో రైతులకు స్పష్టత ఇవ్వాల్సి ఉంటుంది అని ఆయన పేర్కొన్నారు. అందుబాటులో ఉన్న నీటిని అంచనా వేసుకొని సమాచారం తెలియజేయాలి.. ప్రాజెక్ట్ ల వారీగా పూర్తి వివరాలతో సమీక్షకు వస్తామన్న అధికారులు తెలిపారు.

Read Also: అబ్బా అనిపించేలా నభా నటేష్ పోజులు.. బర్త్ డే బేబీ హాట్ ట్రీ చూశారా?

ఇక, మేడిగడ్డ ప్రాజెక్టు పిల్లర్ కుంగడంపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి అధికారులు వివరణ ఇచ్చారు. మేడిగడ్డ ప్రాజెక్ట్ నిర్మాణానికి 4600 కోట్లు ఖర్చు చేసామని ఇరిగేషన్ ఈఎన్సీ మురళీధర్ తెలిపారు. ఒక పిల్లర్ 1.2 మీటర్లు కుంగింది మరో మూడు పిల్లర్లపై ఆ ప్రభావం పడింది.. మొత్తం నాలుగు పిల్లర్లపై ఆ ప్రభావం పడింది.. ముందు రోజు సాయంత్రం పిల్లర్స్ కుంగిన వెంటనే ప్రాజెక్ట్ లో నీటిని తీసేసాం.. వెంటనే స్పందించాం నీటిని తీసేసిన తర్వాత కుంగడం తగ్గింది అని ఆయన చెప్పారు.