ఎస్ఎల్‌బీసీ టన్నెల్‌లో ప్రమాదం చోటు చేసుకుని మూడు రోజులు గడుస్తుంది. టన్నెల్‌లో గల్లంతైన ఎనిమిది మంది ఆచూకీపై ఇంకా క్లారిటీ లేదు. రెస్క్యూ టీమ్స్ పలుమార్లు టన్నెల్‌లోకి వెళ్లి ముందుకు వెళ్లే పరిస్థితి లేకపోవడంతో తిరిగి వచ్చాయి. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. రెస్క్యూ విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధిని ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. టన్నెల్లో చిక్కుకున్న వారిని క్షేమంగా తిరిగి తీసుకురావడానికి సర్వ శక్తులా ప్రయత్నిస్తున్నామని పేర్కొన్నారు. దేశంలో అత్యంత నిపుణులైన 10 ఏజెన్సీలు ఈ రెస్క్యూలో పనిచేస్తున్నాయి.. ఇండియన్ ఆర్మీ, ఇండియన్ నేవీ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, సింగరేణి, జియాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, నేషనల్ రిమోట్ సెన్సింగ్ అన్నీ కలిసి పనిచేస్తున్నాయని మంత్రి ఉత్తమ్ తెలిపారు.
Read Also: Belly Fat: బెల్లి ఫ్యాట్ తగ్గాలంటే ఈ ‘టీ’లు తాగాల్సిందే!
ముఖ్యమంత్రి కూడా ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు.. ప్రమాదం జరిగిన వెంటనే వేగంగా స్పందించామని మంత్రి పేర్కొ్న్నారు. ఇలాంటి ప్రమాదాల్లో రెస్క్యూ ఆపరేషన్స్ చేసే అనుభవం ఉన్న వాళ్ళను కూడా ఆహ్వానిస్తున్నాం.. మేము ఇంత చేస్తుంటే.. కొందరు చిల్లర రాజకీయం చేస్తున్నారని ఉత్తమ్ కుమార్ రెడ్డి దుయ్యబట్టారు. కాళేశ్వరంలో ఏడుగురు చనిపోతే మేము మాట్లాడలేదు.. శ్రీశైలం పవర్ ప్లాంట్ లో కూడా ఎనిమిది మంది చనిపోతే కూడా ఏనాడు మాట్లాడలేదని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ప్రకృతి వైపరీత్యాల వల్ల జరిగిన ప్రమాదం దురదృష్టకరమని అభిప్రాయపడ్డారు.
Read Also: MLC Elections 2025: మేం మూడు స్థానాల్లో గెలుస్తున్నాం: కిషన్ రెడ్డి
దేశంలోనే గొప్ప ప్రాజెక్టు ఇది.. 45 కి.మీలలో 30 కి.మీ పూర్తి అయ్యిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ప్రతిపక్షాలు మినిమం సెన్స్ లేకుండా మాట్లాడుతున్నాయి.. ప్రాజెక్ట్ పూర్తి ఐతే నల్గొండ జిల్లాలో లక్షల ఎకరాలకు నీరు అందుతుంది.. ఫ్లోరైడ్ బాధ తొలుగుతుందని తెలిపారు. బీఆర్ఎస్ హయాంలో 10 ఏళ్ల పాటు ప్రాజెక్ట్ పనులు నిలిపివేశారని మంత్రి ఆరోపించారు. మరోవైపు.. టన్నెల్‌లో చిక్కుకున్న వారి ప్రాణాలు కాపాడటానికి సర్వ శక్తులా కృషి చేస్తున్నాం.. ప్రమాదం జరిగిన స్థలంలో నీరు లీక్ అవుతోంది.. నీటి ఉధృతి కూడా పెరిగిందని రెస్క్యూ టీమ్స్ చెప్తున్నాయని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు.