NTV Telugu Site icon

Medigadda Project: కాళేశ్వరంపై జ్యూడిషియల్ విచారణ చేస్తాం..

Uttamkumar Reddy

Uttamkumar Reddy

మేడిగడ్డలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ రెడ్డి, పొంగులేటి, కోమటిరెడ్డి వెంకట రెడ్డి, పొన్నం ప్రభాకర్ పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా మేడిగడ్డ నిర్మాణంపై అధికారులు రూపొందించిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ను పరిశీలించారు. కాసేపట్లో మేడిగడ్డ బ్యారేజ్ కి మంత్రుల బృందం వెళ్లనుంది. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ మాట్లాడుతూ.. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళపై తాము చెప్తున్న విషయాలు నిజం అయ్యాయని తెలిపారు. లక్షల కోట్లు అప్పు.. పదుల కోట్లు బిల్లులు బకాయి అని ఆరోపించారు. మరి ప్రాజెక్టు కట్టిన ప్రయోజనం ఏంటి అని ప్రశ్నించారు. కాళేశ్వరంకు జాతీయ హోదా కోసం అప్పటి ప్రభుత్వం అప్లై చేసామన్నది.. ప్రొఫార్మ ప్రకారం కేంద్రం పంపలేదు అని చెప్పింది అని మంత్రి తెలిపారు. కాళేశ్వరం జాతీయ ప్రాజెక్టు తేవడంలో బీఆర్ఎస్, బీజేపీ ఫెయిల్ అని విమర్శించారు.

Read Also: Akhu Chingangbam Kidnap: మణిపూర్ గాయకుడు-గీత రచయిత అఖు చింగాంగ్‌బామ్‌ కిడ్నాప్

కాళేశ్వరంపై జ్యూడిషియల్ విచారణ చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. అంతేకాకుండా.. పాలమూరు, రంగారెడ్డికి జాతీయ హోదా సాధిస్తామన్నారు. బ్యారేజ్ కుంగింది.. తప్పు జరిగిందని ఆరోపించారు. బ్యారేజ్ స్టోరేజ్ కెపాసిటీ 16 టీఎంసీ ఎక్కడా ఉండదని మంత్రి తెలిపారు. డిజైన్, కాన్సెప్ట్ ఫెయిల్ అని మంత్రి పేర్కొన్నారు. ఎన్నికల ముందు అధికారులు ఇచ్చిన నివేదిక.. అప్పటి ప్రభుత్వానికి లబ్ది చేకూర్చే పనిలో ఇచ్చారని తెలిపారు. డ్యామ్ సేఫ్టీకి అప్పటి అధికారులు ఇచ్చిన నివేదిక కాదు.. ఇప్పుడు పూర్తి సమాచారం ఇస్తామని మంత్రి తెలిపారు.

Read Also: Trisha : దాదాపు 13 ఏళ్లకు బాలీవుడ్ లో రీఎంట్రీ ఇస్తున్న త్రిష.. ఆ బిగ్ స్టార్ మూవీలో హీరోయిన్ గా ఛాన్స్..?

మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. వృధాగా గోదావరిలోకి వదిలిన నీళ్లు ఎన్ని ప్రశ్నించారు. రెండు పంటలకు నీళ్లు ఇస్తున్నామా అని అధికారులను అడిగి తెలుసుకున్నారు. కాళేశ్వరం నుండి ఎకరాకు నీళ్లు ఇవ్వడానికి అయ్యే ఖర్చు 46 వేలు.. లిఫ్ట్ కి విద్యుత్ రాష్ట్రంలో వినియోగించే 90 శాతం వాడాల్సి ఉంటుందని తెలిపారు. మూడో టీఎంసీకి 26 వేల కోట్లు ఖర్చు అవుతుందని అన్నారు. మల్లన్న సాగర్ రిజర్వాయర్, భూకంపం ప్రమాదం పై అంచనా వేశారా లేదా..? అని ప్రశ్నించారు. బాహుబలి పంపులపై క్లారిటీ ఇవ్వాలని మంత్రి శ్రీధర్ బాబు అధికారులను కోరారు.