NTV Telugu Site icon

Minister Uttam Kumar Reddy: సింగూరు, మంజీరాలకు గోదావరి జలాలు

Uttam Kumar Reddy

Uttam Kumar Reddy

Minister Uttam Kumar Reddy: జలసౌధలో ఉమ్మడి మెదక్ జిల్లా నీటిపారుదల ప్రాజెక్ట్‌లు, ఎత్తిపోతల పథకాలపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు. సింగూరు, మంజీరాలకు గోదావరి జలాలు రానున్నాయని.. మహానగరానికి మంచినీటితో పాటు సేద్యంలోకి కొత్త ఆయకట్టు రానుందన్నారు. అదే తరహాలో నిజాంసాగర్‌కు గోదావరి జలాలు వస్తాయన్నారు. సింగూరు ప్రాజెక్ట్‌లో పూడిక తీతకు సన్నద్ధంగా ఉన్నట్లు.. తద్వారా నీటి సామర్ధ్యం పెంపుకు చర్యలు చేపడుతున్నామన్నారు. పూడిక తీతతో మహానగరానికి మంచినీటి సమస్యలు తీరనున్నాయన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పూడిక తీతకు నిర్ణయం తీసుకున్నామన్నారు.

Read Also: High Court: హైదరాబాద్‌లోని అన్ని చెరువులపై పర్యవేక్షణ మాదే..

కాలువల లైనింగ్‌కు టెండర్ల ప్రక్రియ మొదలు పెట్టాలని అధికారులను ఆదేశించారు. బసమేశ్వర, సంఘమేశ్వర, ఎత్తిపోతల పథకాలు సత్వరమే పూర్తికి ఆదేశాలు జారీ చేశారు. పెద్దారెడ్డిపల్లి ఎత్తిపోతల పథకానికి ప్రతిపాదనలు సిద్ధం చెయ్యాలన్నారు. అర్ధాంతరంగా ఆగిపోయిన ప్యాకేజీ 19ఏ పనులు పునరుద్ధరణకు నిర్ణయం తీసుకున్నామన్నారు. ప్యాకేజీలు 17,18,19 పనులను వేగవంతం చెయ్యాలన్నారు. 38 మైనర్ ఇరిగేషన్ ట్యాంకులకు మరమ్మతులు చేస్తామన్నారు. నల్లవాగు మీడియం ప్రాజెక్ట్ కెనాల్‌కు మరమ్మతులు చేపడతామన్నారు. కారముంగి ఎత్తిపోతల పథకానికి గ్రీన్ సిగ్నల్ వచ్చిందన్నారు.