NTV Telugu Site icon

Uttam Kumar Reddy: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి రూ.5 లక్షలు అందజేసిన మంత్రి..

Uttam Kumar Reddy

Uttam Kumar Reddy

మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వలిగొండ మండలం నాతాళ్లగూడెంలో ప్రతిష్టాత్మక నాలుగు సంక్షేమ పథకాలను ప్రారంభించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం 98 మందికి 5 లక్షలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “రాష్ట్రంలో ప్రస్తుతం అమలు అవుతున్న సంక్షేమ పథకాలు దేశ చరిత్రలో ఏ పాలకులు ఇవ్వలేదు. గత ప్రభుత్వం కంటే మేము 20% పెంచి రైతు భరోసా ఇస్తున్నాం. వ్యవసాయానికి యోగ్యమైన భూమికే రైతు భరోసా ఇస్తున్నాం. బీఆర్ఎస్ పాలించిన పదేళ్లు రేషన్ కార్డులు ఇవ్వలేదు. ఉప ఎన్నికలు వచ్చిన చోటే కొత్తగా రేషన్ కార్డులు మంజూరయ్యాయి. రాష్ట్రాల్లో అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి రేషన్ కార్డు అందజేస్తాం. సంక్షేమ పథకాలు అందుకోవడానికి అర్హతలు ఉన్న చివరి లబ్ధిదారుడి వరకు అన్ని పథకాలు అందజేస్తాం. రేషన్ బియ్యాన్ని సగం మంది వినియోగించుకోవడంలేదు.. బ్లాక్ మార్కెట్ కు అమ్ముకుంటున్నారు.” మంత్రి తెలిపారు.

READ MORE: Central Bank Of India Recruitment 2025: డిగ్రీ అర్హతతో బ్యాంక్ జాబ్స్.. నెలకు రూ. 85 వేల జీతం

కొత్త రేషన్ కార్డులు మంజూరు అయ్యాక… నాణ్యమైన సన్న బియ్యం అందజేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. “అర్హులైన వారందరికీ ఇందిరమ్మ ఇల్లు మంజూరు అవుతాయి. ఓడిపోయిన ఫ్రస్టేషన్ లో కాంగ్రెస్ పార్టీపై బీఆర్ఎస్ విమర్శలు చేస్తుంది. పండిన ప్రతి గింజను కొనుగోలు చేసాం సన్నబియానికి బోనస్ ఇచ్చాము. భువనగిరి నియోజకవర్గం లో పెండింగ్ సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేస్తాం.” అని మంత్రి వ్యాఖ్యానించారు.

READ MORE: Bikes Under One Lakh : కేవలం లక్షలోపు మార్కెట్లో లభించే బెస్ట్ స్కూటర్లు ఇవే.. అదుర్స్ అనిపించే ఫీచర్లు, మైలేజ్