NTV Telugu Site icon

Ushasri Charan : పవన్ కు క్లారిటీ ఉంటే ఢిల్లీ పర్యటనలో క్లారిటీ వస్తుంది

Ushasri Charan

Ushasri Charan

మంత్రి ఉషశ్రీ చరన్‌ ఈరోజు శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆమెకు ఆలయ అర్చకులు ఘన స్వాగతం పలికారు. ఆమె కుటుంబ సమేతం స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. జగన్ పాదయాత్రలో నవరత్నాలు సంక్షేమ పథకాలు పేరుతో పాదయాత్ర చేశారన్నారు. లోకేష్ యువగళం పాదయాత్రలో ఎమ్మెల్యేలపై విమర్శలు తప్ప పథకాలు ఏమిస్తామని ప్రజల్లోకి వెళ్లలేకపోతున్నారన్నారు మంత్రి ఉషశ్రీ చరణ్.

Also Read : Peddireddy Ramachandra Reddy : రాష్ట్రంలో విద్యుత్ శాఖ ఒక ప్రధాన పాత్ర పోషిస్తుంది

పవన్ స్టాండ్ లేని వ్యక్తి…. ఆయనపై ఆయన స్టాండ్ ఏంటో ఆయనకే తెలియదని ఉషశ్రీ చరణ్ అన్నారు. పవన్ కు క్లారిటీ ఉంటే ఢిల్లీ పర్యటనలో క్లారిటీ వస్తుందని ఆమె ఎద్దేవా చేశారు. మా నమ్మకం నువ్వే జగనన్న స్టిక్కర్ కింద జనసేన కార్యకర్తలు స్టిక్కర్ వేయడం రాజకీయ దురుద్దేశమన్నారు. జనసేన కార్యకర్తలు అసలు ఏం చేస్తారని, ఏం చేయబోతారు అనే స్టాండ్ ఉండి అప్పుడు ప్రతి ఇంటికి వెళ్తే అర్ధం ఉంటుందని ఆమె వ్యాఖ్యానించారు. శ్రీశైలం మలన్న దేవస్థానంలో చెబుతున్నా…. ఈసారి మళ్ళీ జగన్ అధికారంలోకి వచ్చి ప్రజారంజక పరిపాలన అందిస్తారు అని ఉషాశ్రీ చరణ్ ధీమా వ్యక్తం చేశారు.

Also Read : Karnataka : బీజేపీ కొత్త ప్రయోగాలు.. అభ్యర్థుల జాబితాలో కాషాయ వ్యూహం