NTV Telugu Site icon

Tummala Nageswara Rao: ఎంపీ అరవింద్ వ్యాఖ్యలపై మంత్రి తుమ్మల సీరియస్..

Tummala Nageswara Rao

Tummala Nageswara Rao

పసుపు బోర్డుపై ఎంపీ అరవింద్ వ్యాఖ్యలపై మంత్రి తుమ్మల స్పందించారు. ఎంపీ వ్యాఖ్యలపై సీరియస్ అయ్యారు. నువ్వెక్కడ పోయావని అడిగినా ప్రశ్నకు… తాను కేంద్రానికి రాసిన లేఖలు విడుదల చేశారు. పసుపు బోర్డు ఏర్పాటు చేసినందుకు ప్రధానికి అభినందనలు చెప్పడం కూడా తప్పేనా అని పేర్కొన్నారు. “అభినందనలు చెప్పడం కూడా తప్పే అంటే… అది మీ రాజకీయ పరిజ్ఞానానికి వదిలేస్తున్నా. పసుపు బోర్డు ఏర్పాటు అర్ధరాత్రి ప్రకటించి… తెల్లారి ప్రారంభించినా మేము తప్పు పట్టట్లేదు.. ఫెడరల్ స్ఫూర్తి నీ కూడా పాటించలేదు మీరు. కానీ మీరు నన్ను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు కాబట్టి… మీకు కొన్ని విషయాలు చెప్తా. నేను వ్యవసాయ శాఖ మంత్రి అయ్యాక… మూడు సార్లు కేంద్రానికి ఉత్తరాలు రాశా. రెండు సార్లు మా కమిషనర్ తో లేఖ రాయించా… మా సిఎం తో కూడా కేంద్రాన్ని అడిగించా. నేను ఎక్కడ ఉన్నా… ఆ శాఖ కి పూర్తిగా న్యాయం చేస్తా. కావాలంటే మీ బీజేపీ పెద్దలను అడుగు నా పనితీరు గురించి” అని మంత్రి వ్యాఖ్యానించారు.

READ MORE: Mark Zuckerberg: లోక్‌సభ ఎన్నికలపై మార్క్ జుకర్‌బర్గ్‌ సంచలన వ్యాఖ్యలు.. భారత్‌కు క్షమాపణలు చెప్పిన మెటా

Show comments