భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలంలో పెద్దవాగు ప్రాజెక్ట్ గండి పడడంతో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రాజెక్టును సందర్శించారు. అనంతరం.. ఆయకట్ట రైతులను పరామర్శించి నీట మునిగిన ఇళ్ళను సందర్శించారు. కొత్తూరు గ్రామానికి చెందిన మురళి అనే వ్యక్తి విద్యుత్ షాక్తో మృతి చెందిగా ఆ కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా.. గుమ్మడవల్లి ప్రభుత్వ కాలేజీలో అధికారులతో సమీక్షలో అన్ని శాఖల అధికారులకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు క్లాస్ పీకారు. ఇరిగేషన్ అధికారులతో ఆయన మాట్లాడుతూ.. అసలు ప్రాజెక్ట్ గేట్లు ఎందుకని ముందుగా ఎత్తలేదని ప్రశ్నించారు. జూన్, జులైలో ఎందుకు మోటర్లపై పర్యవేక్షణ చేయలేదని అధికారులను అడిగారు. నీరు వస్తుందని తెలుసు కదా.. మీరు అబద్ధం చెప్పిన నేను ప్రజలను అడుగుతానని తుమ్మల పేర్కొన్నారు. ప్రాజెక్ట్ కూలే నాటికి జులై వచ్చి 18 రోజులు అయ్యింది.. ఆ 18 రోజుల్లో మోటార్లు ఎందుకు చెక్ చేయలేదని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
Kanwar Yatra: అఖిలపక్ష సమావేశంలో “కన్వర్ యాత్ర” వివాదాన్ని లేవనెత్తిన ప్రతిపక్షాలు..
జులై 17వ తేదీనే గేట్లు ఎత్తి ఉంటే ఇంతటి నష్టం జరిగేది కాదని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఎప్పటికప్పుడు మీకు ఎన్ని మిల్లీమీటర్లు వర్షపాతం నమోదవుతుందో తెలుసు.. అయినా ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించారని అధికారులప ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతారం, కొత్తూరు మండల వ్యాప్తంగా 72 ఇళ్ళు నీట మునిగాయి.. 250 మందికి నిత్యం భోజనం, ప్రతి కుటుంబానికి 10 కేజీలు బియ్యం, నిత్యావసర సరుకులు ఏర్పాటు చేయండని తుమ్మల ఆదేశించారు. మీరు మంచిగా చేయకపోతే రానున్న రోజుల్లో డెంగ్యూ, విష జ్వరాలు వస్తాయన్నారు. అందులో వేలేరుపాడు. కుకునూరు, అశ్వారావుపేట మండలాల్లో ఎక్కువుగా ఉంటాయని మంత్రి తెలిపారు.
Lavu Sri Krishna Devarayalu: ఏపీ ఆర్థిక వ్యవస్థ ఎలా ఉందో పార్లమెంట్‌లో వివరిస్తాం..
హెల్త్ డిపార్ట్మెంట్ ఇంటి ఇంటికి తిరిగి వైద్యం చేయండని సూచించారు. ముందుగా నీట మునిగిన ఇళ్ళ వద్దకు మీరే వెళ్ళండి.. డాక్టర్స్ కానీ మొబైల్ వ్యానులు ఇంకా ఏమైనా కావాలంటే వెంటనే కలెక్టర్ పంపిస్తారు ఏ ఒక్కరికి జ్వరం రావద్దని తెలిపారు. అన్ని శాఖలతో సమన్వయంతో ఉంటూ ప్రతి గ్రామానికి తిరగాలి.. ఏ సమస్య ఉన్న కలెక్టర్ చెప్పాలి అంటూ పోలీస్ శాఖకు మంత్రి తుమ్మల సూచించారు. నష్టపోయిన ఏ ఒక్క రైతు ఇబ్బంది పడకుండా చూసుకోవాలి అంటూ వ్యవసాయ శాఖకు ఆదేశం చేశారు. హాస్టల్స్, స్కూల్స్ ప్రతి ఒక్కటి మీరు క్షుణ్ణంగా పరిశీలించి విద్యుత్ సరఫరాలో ఎటువంటి నిర్లక్ష్యం వ్యవహరించకండి అంటూ విద్యుత్ శాఖకు సూచించారు. ఏ ఒక్క పాత స్కూల్, హాస్టల్ బిల్డింగ్స్ ఉండకూడదు.. అవసరమైతే రేకులు షెడ్ వేయించండి.. ఏ ఒక్క పిల్లోడికి ప్రమాదం జరిగిందంటూ వార్తలు రావద్దని మంత్రి తుమ్మల పేర్కొన్నారు.