Site icon NTV Telugu

Thummala Nageswara Rao: అప్పటిలోగా అకౌంట్లలో రైతు భరోసా నిధులు.. క్లారిటీ ఇచ్చిన మంత్రి..!

Thummala Nageswara Rao

Thummala Nageswara Rao

రైతు భారోసా నిధులపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు క్లారిటీ ఇచ్చారు. నాలుగు ఎకరాల వరకు రైతుభరోసా నిధులు జమ చేస్తామని మంత్రి స్పష్టం చేశారు. రైతుభరోసా కోసం మరో రూ.1313.53 కోట్లు విడుదలైనట్లు తెలిపారు. మరో వారంలోగా పూర్తిగా రైతుభరోసా నిధుల జమ చేస్తామని భరోసా ఇచ్చారు. బీఆర్‌ఎస్ నాయకులకు తమ ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు లేదని విమర్శించారు. సాగు సమయానికి రైతుబంధు నిధులు ఎప్పుడూ పడలేదని.. ఒక సందర్భంలో మినహా ప్రతిసారి ఆలస్యంగానే వానాకాలం రైతుబంధు నిధులు జమ చేశారన్నారు. ఆర్థిక పరిస్థితులు అంతంతమాత్రంగానే ఉన్న తమ ప్రభుత్వం హయాంలో రైతులకు ఏ పథకాలను ఆపడం లేదని తెలిపారు. రైతుల సంక్షేమం విషయంలో దేశానికే ఆదర్శంగా తెలంగాణ నిలిచిందని కొనియాడారు.

READ MORE: Womens T20 World Cup 2026 Schedule: మరోమారు దాయాదుల సమరం.. మహిళల టీ20 ప్రపంచకప్ 2026 షెడ్యూల్ విడుదల..!

Exit mobile version