NTV Telugu Site icon

Minister TG Bharath: ఆక్రమణల తొలగింపులో తొందరపాటు వద్దు.. జనం వీధిన పడతారు..

Tg Bharath

Tg Bharath

Minister TG Bharath: మున్సిపల్ కార్పొరేషన్ అధికారులతో మంత్రి టీజీ భరత్ సమీక్ష సమావేశం నిర్వహించారు. కర్నూలులో పారిశుధ్యం, మౌలిక సౌకర్యాల అభివృద్ధి, పచ్చదనంపై మంత్రి భరత్ అధికారులను ఆరా తీశారు. ఆక్రమణల తొలగింపులో తొందరపాటు వద్దని మంత్రి సూచించారు. చిన్న వ్యాపారులు, పేదలతో చర్చించి ప్రత్యామ్నాయం చూపిన తరువాతనే ఆక్రమణలు తొలగించాలని ఆయన సూచనలు చేశారు. ఉన్నట్టుండి ఆక్రమణలు తొలగిస్తే జనం వీధిన పడతారని వెల్లడించారు. కర్నూలులో రంగు మారిన నీళ్లు వస్తున్నాయని.. శుద్దమైన నీరు సరఫరా అయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రతి రోజు టైమ్‌కు తాగు నీరు వచ్చేలా చూడాలన్నారు. కర్నూలును స్మార్ట్ సిటీగా చేయడమే తన లక్ష్యమన్నారు.

Read Also: Nara Lokesh: విద్యాశాఖపై మంత్రి నారా లోకేష్ సమీక్ష

తన కంపెనీ నుంచి ఉచితంగా హైపో ద్రావణం ఇస్తానన్న మంత్రి.. దోమల నివారణకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలన్నారు. హంద్రీనదికి వరదలు వస్తే పలు కాలనీలు మునుగుతాయని.. పూడిక తీసేందుకు పనులు మొదలు పెట్టాలన్నారు. తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను మంత్రి టీజీ భరత్ ఆదేశించారు.