విదేశీ పర్యటనపై కొంతమంది సినిమా షో ప్లాప్ అయ్యిందని అంటున్నారని.. మా విజన్ వాళ్ళ ముందు పెట్టామని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. హైదరాబాద్ వరకే కంపెనీలను పతిమితం చెయ్యమని.. ద్వితీయ శ్రేణి నగరాల్లో కూడా కంపెనీలు పెడతామన్నారు. సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. “ప్రతి గ్రామం అభివృద్ధి చెందాలని మా ఆలోచన. అదే విషయం కంపెనీలకు తెలియజేశాం. దావోస్ లో జరిగిన ఒప్పందాలకు ఒక్కొక్క డిపార్ట్ నుంచి సెల్ ఏర్పటు చేసి Mou లపై ముందుకు వెళ్తున్నాం. మా తరఫున నుంచి అన్ని కంపెనీలకు సహకారం అందిస్తాం. ప్లాప్ షో హిట్ షో అనేది ఎంటర్టెన్మెంట్ షో లో ఉంటుంది. ఒప్పందాలు కుదుర్చుకున్న కంపనీలపై అసూయ ఉండి కామెంట్స్ చేస్తే మేము ఏమి చేయలేము. కేసీఆర్ చైనా కి 15 రోజులు పోయారు.. రూ. 1000 కోట్లు ఒప్పందం చేసుకున్నారు. రూ. 200 కోట్ల పెట్టుబడులు పెట్టారు. మేము ఏమి అనలేదు.” అని మంత్రి వ్యాఖ్యానించారు.
READ MORE: Friday Up Consultancy: బోర్డు తిప్పేసిన మరో సాఫ్ట్ వేర్ కంపెనీ.. ట్రైనింగ్ పేరుతో మోసం
నెగటివ్ గా చూస్తే నెగటివ్ గానే కనిపిస్తాయని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. Mou లకు పరిమితం కామని.. కంపనీలతో నిత్యం టచ్ లో ఉంటామన్నారు. టెక్నాలజి పరంగా ఎవరు ముందుకు వచ్చిన ఆహ్వానం పలుకుతామని స్పష్టం చేశారు. ఏ కుటుంబం వాళ్ళు కొత్త టెక్నాలజి తో వచ్చిన mou కుదుర్చుకున్నామని తెలిపారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు 19 సంస్థలతో రూ.31,500 కోట్ల విలువైన ఒప్పందాలు చేసుకున్నామని మంత్రి వివరించారు. ఈ పెట్టుబడుల ద్వారా 30,750 ఉద్యోగాలు వచ్చే అవకాశముందన్నారు. ‘‘దక్షిణ కొరియాలో దాదాపు 12 సంస్థలతో చర్చలు జరిపాం. ఏఐ, ఫ్యూచర్ సిటీలో పెట్టుబడులపై చర్చించాం. మూసీ పునరుజ్జీవం కోసం కొన్ని అధ్యయనాలు చేశాం. మూసీ సుందరీకరణపై ప్రపంచబ్యాంక్ అధ్యక్షుడితో చర్చించాం. రాష్ట్రంలో బయోడిజైర్ సిటీని ఏర్పాటు చేయాలని స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీని కోరాం’’ అని మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు.
