జీనోమ్ వ్యాలీలో రూ. 2వేల కోట్ల కొత్త పెట్టుబడులు వచ్చాయని.. మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. పారిశ్రామికంగా పెద్ద సంఖ్యలో పరిశ్రమలు తెలంగాణకు వచ్చాయని తెలిపారు. డిజిటల్ హెల్త్ విషయంలో పరిశ్రమలకు ప్రోత్సాహకాలు అందిస్తున్నామని చెప్పారు. తెలంగాణ రాష్ట్రాన్ని హెల్త్ హబ్ గా తయారు చేయబోతున్నట్లు తెలిపారు. MSME పాలసీని మరింత పటిష్టంగా తెచ్చామని.. చిన్న, మధ్య తరగతి పరిశ్రమల వల్ల ఉపాధి ఎక్కువగా ఉంటుందని వివరించారు. రాబోయే పదేళల్లో ORR చుట్టూ పది పారిశ్రామిక పార్క్ లు తేబోతున్నట్లు వెల్లడించారు.
ఇన్నోవేట్ తెలంగాణ పేరుతో స్టార్టప్ లను ప్రోత్సాహం అందిస్తున్నట్లు చెప్పారు.
READ MORE: Gas vs Electric Geyser: గీజర్ లేదా ఎలక్ట్రిక్ గీజర్ లలో ఏది ఉత్తమమైంది
AI- INSTITUTE ను వచ్చే ఫస్ట్ క్వాటర్స్ లో ప్రారంభించుకోబోతున్నట్లు మంత్రి తెలిపారు. డ్రగ్ నిర్మూలన కోసం ప్రత్యేక యాప్… 1000 పాఠశాలల్లో ఈనెల 8వ తేదిన ముఖ్యమంత్రి రేవంత్ ప్రారంభిస్తారని వెల్లడించారు. మీ సేవ ద్వారా ప్రతిరోజు 80వేల పౌరులకు సేవలు అందిస్తోందని.. డిజిటల్ ఎంప్లాయిమెంట్ ప్లాట్ ఫామ్ రూపొందించామన్నారు.
READ MORE:Sambit Patra Target Rahul Gandhi: రాహుల్ గాంధీ ఉన్నత స్థాయి ద్రోహి.. బీజేపీ నేత తీవ్ర విమర్శలు