NTV Telugu Site icon

Minister Seethakka: రేపు ప్రజాభవన్‌లో సంచార చేప‌ల విక్రయ వాహ‌నాల ప్రారంభం..

Seethakka

Seethakka

తెలంగాణ రాష్ట్రంలో మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం వినూత్న కార్యక్రమాలను తీసుకొస్తుంది. ఈ క్రమంలో మంత్రి సీత‌క్క రేపు సంచార చేప‌ల విక్రయ వాహ‌నాలను ప్రారంభించనున్నారు. ప్రజా భ‌వ‌న్ వేదిక‌గా ఉద‌యం 9.30 గంట‌ల‌కు మంత్రి వాహ‌నాలను ప్రారంభించనున్నారు. తొలి విడ‌త‌లో 25 వాహ‌నాల‌ను ల‌బ్దిదారుల‌కు అంద‌చేయనున్నారు మంత్రి సీతక్క. ఇందిరా మహిళా శక్తి కార్యక్రమం కింద సెర్ప్ ద్వారా స్వయం సహాయక బృందాల‌కు సంచార చేప‌ల విక్రయ వాహ‌నాలను అందజేయనున్నారు. చేపల విక్రయంలో ఉన్న ఆసక్తి గల SHGల‌ను జిల్లా మత్స్య అధికారులు, డిఆర్‌డిఓలు ఎంపిక చేశారు. ప‌చ్చి చేప‌ల‌తో పాటు చేప‌ల వంట‌కాల‌ను విక్రయించేలా సంచార చేప‌ల విక్రయ వాహ‌నాలు ఉండనున్నాయి.

Read Also: India Pakistan: పాక్‌లో ఉగ్రవాదుల్ని చంపుతున్నది ఇండియానే.. వాషింగ్టన్ పోస్ట్ కథనం..

వాహ‌నాల్లో చేప‌లు, వంట‌కాలు త‌యారీ చేసి మార్కెట్లు, ర‌ద్దీ ప్రాంతాల్లో విక్రయించే సౌక‌ర్యం ఉంది. మొదటి దశలో జిల్లాకు ఒక వాహ‌నం చొప్పున‌ 32 వాహ‌నాలు మంజూరు చేయనున్నారు. ఒక్కో వాహ‌నం ఖరీదు రూ.10 లక్షలు.. ఫ్యాబ్రికేషన్‌తో క‌లిపి రూ. 10.38 లక్షలు ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి మత్స్య యోజన పథకంతో అనుసంధానం చేసి.. 60 శాతం సబ్సిడీతో నాలుగు లక్షల రూపాయలకే మహిళా సంఘాలకు కేటాయించనున్నారు. మిగిలిన మొత్తాన్ని బ్యాంకుల ద్వారా వ‌డ్డీ లేని రుణాల రూపంలో సెర్ప్ స‌మ‌కూర్చనున్నారు. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక పురోగాభివృద్ధికి మొబైల్ ఫిష్ రిటైయిల్ అవుట్ లెట్స్ దోహ‌ద‌ప‌డ‌నున్నాయి.

Read Also: New Political Party: దేశంలో కొత్త రాజకీయ పార్టీ.. జైలు నుంచే కార్యకలాపాలు!

Show comments