దేశంలో మరో కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భావం కానుంది. జైల్లో ఉన్న ఖలిస్థానీ అమృతపాల్ సింగ్ ఇప్పుడు పంజాబ్‌లో పెద్ద రాజకీయ ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారు. జనవరి 14న రాజకీయ పార్టీని ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ముక్త్‌సర్ సాహిబ్‌లో జరగనున్న మాఘీ జాతరలో అమృతపాల్ సింగ్ తన కొత్త పార్టీ ఏర్పాటును ప్రకటించనున్నారు. ఈ జాతరలో సిక్కు సమాజానికి చెందిన ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివస్తారు. లోహ్రీ సందర్భంగా నిర్వహించే ఈ మేళకు పంజాబ్‌లో చాలా ప్రాముఖ్యత ఉంది. అమృతపాల్ సింగ్ తండ్రి, అతని మద్దతుదారులు పంత్ బచావో, పంజాబ్ బచావో ర్యాలీని కూడా నిర్వహించనున్నారు.
READ MORE: R.S. Brothers: విశాఖలో అతిపెద్ద సరికొత్త షోరూమ్ ఆర్.ఎస్.బ్రదర్స్ శుభారంభం..
పార్టీ ఏర్పాటును ఈ ర్యాలీలోనే అమృతపాల్ సింగ్ కుటుంబ సభ్యులు, మద్దతుదారులు ప్రకటిస్తారు. అమృతపాల్ సింగ్ ప్రస్తుతం అస్సాంలోని దిబ్రూగఢ్ జైలులో ఉన్న విషయం తెలిసిందే. అతనిపై ఎన్‌ఎస్‌ఏ విధించారు. ఆయన రాజకీయ పార్టీ పెడుతున్నట్లు సహచరుడు సుఖ్వీందర్ సింగ్ అగ్వాన్ ధృవీకరించారు.సుఖ్వీందర్ సింగ్ అగ్వాన్ కూడా ఛాందసవాద భావజాలానికి చెందినవాడు. ఇతను మాజీ ప్రధాని ఇందిరా గాంధీ హత్యకేసులో ప్రమేయం ఉన్న సత్వంత్ సింగ్ మేనల్లుడు. సుఖ్వీందర్ సింగ్‌కి అమృతపాల్ సింగ్, ఆయన కుటుంబంతో చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.
READ MORE: Pinaka: ఆసక్తికరంగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కన్నడ మూవీ ‘పినాక’ టీజర్
ఇక పంజాబ్‌లోలోని ఖదూర్ సాహిబ్ లోక్‌సభ స్థానం నుంచి వేర్పాటువాది అమృతపాల్ సింగ్ బంపర్ మెజార్టీతో గెలుపొందారు. ప్రస్తుతం అసోంలోని దిబ్రూగఢ్ జైలులో ఉన్న ఆయన స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగారు. కాంగ్రెస్ అభ్యర్థి కుల్బీర్ సింగ్ జీరాపై లక్షా 97వేల 120ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. అమృత్‌సర్ జిల్లా అజ్‌నాలా పోలీసులపై దాడి కేసులో ‘వారిస్ పంజాబ్ దే’ నాయకుడు, వేర్పాటువాది అమృత్‌పాల్ పేరు దేశవ్యాప్తంగా మార్మోగింది. జాతీయ భద్రతా చట్టం కింద 2023 ఏప్రిల్‌లో పోలీసులు ఆయన్ను అరెస్టు చేశారు. అప్పటి నుంచి అస్సాంలోని దిబ్రూగఢ్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో పంజాబ్‌లోని ఖడూర్‌సాహిబ్ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలిచి రికార్డ్ సృష్టించారు.