Site icon NTV Telugu

Minister Seethakka: తన తల్లిదండ్రుల సాక్షిగా.. హరీష్ రావుకి మంత్రి సీతక్క స్ట్రాంగ్ కౌంటర్..

Minister Seetakka

Minister Seetakka

నిన్న(గురువారం) తెలంగాణ కేబినెట్ మీటింగ్ జరిగిన విషయం తెలిసిందే. ఈ మీటింగ్ లో ఇటీవల కాంగ్రెస్ నాయకుల మధ్య జరిగిన వివాదాలకు సంబంధించి రాద్దాంతం జరిగిందని మాజీ మంత్రి హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ కామెంట్స్ పై మంత్రి సీతక్క ఫైర్ అయ్యారు. తన తల్లిదండ్రుల సాక్షిగా హరీష్ రావుకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. సీతక్క మాట్లాడుతూ.. నా తల్లి తండ్రులపై ప్రమాణం చేసి చెప్తున్నా.. నన్ను కన్న సమ్మయ్య సమ్మక్క సాక్షిగా చెప్తున్నా.. నిన్న క్యాబినెట్లో ఎలాంటి రాద్దాంతం జరగలేదు క్యాబినెట్లో రాద్దాంతం జరిగిందని హరీష్ నిరూపించగలడా? అని ప్రశ్నించారు.

Also Read:AP Liquor Scam Case: ఏపీ లిక్కర్‌ కేసులో నిందితులకు షాక్‌..

క్యాబినెట్ ఎజెండా, ప్రజల సమస్యలు తప్పా ఇంకేమీ చర్చ జరగలేదన్నారు. జరగని విషయాలను జరిగిందని మాట్లాడి హరీష్ రావు దిగజారిపోయారని ఎద్దేవ చేశారు. హరీష్ రావు నీచమైన స్థాయికి దిగజారి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. నిన్న ఇండివిజువల్ గా సీఎంతో మాట్లాడినపుడు కూడా ఇతర మంత్రుల మీద చర్చ చేయలేదన్నారు. రాష్ట్రంలో గన్ కల్చర్ తెచ్చింది బీఆర్ఎస్ పార్టీ.. అబద్ధానికి ఆర‌డుగుల‌ సాక్ష్యం హరీష్ రావు అని తెలిపారు. ప్రభుత్వంలో ఉండగా రోడ్లపై అడ్వకేట్లను చంపింది బీఆర్ఎస్ అని విమర్శించారు. దండుపాళ్యం, దండుకున్న పాళ్యం బీఆర్ఎస్ పార్టీనే చురకలంటించారు.

Also Read:X Mark On Train Coach: రైలు వెనుక “X” గుర్తు ఎందుకు ఉంటుందో తెలుసా!

కేసీఆర్ ఫాం హౌజ్ కి పరిమితమైతే రేవంత్ రెడ్డి ప్రజా పాలన అందిస్తున్నారని తెలిపింది. కేసీఆర్ ప్రభుత్వంలో తూ.తూ మంత్రంగా క్యాబినెట్ సమావేశాలు జ‌రిగేవని.. కేసీఆర్ బయటకి రాకపోయేవారని విమర్శలు గుప్పించారు. హరీష్ రావుపై కేసీఆర్ కూతురు అనేక విషయాలను బయట పెట్టిందని సీతక్క అన్నారు. కవిత ఆరోపణలపై హరీష్ సమాధానం చెప్పాలని సీతక్క డిమాండ్ చేశారు.

Exit mobile version