Site icon NTV Telugu

Minister Seethakka: 40 మంది ఆర్టీసీ కార్మికుల ఉసురు తీసింది మీరు కాదా?.. మంత్రి సీతక్క ఫైర్..

Seethakka

Seethakka

మాజీ మంత్రి కేటీఆర్ పై మంత్రి సీత‌క్క ఫైర్ అయ్యారు. తాజాగా కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను మంత్రి సీతక్క తిప్పికొట్టారు. సీఎం రేవంత్ రెడ్డి పై అనవసర వ్యాఖ్యలతో కేటీఆర్ త‌న అస‌హ‌నాన్ని ప్రద‌ర్శిస్తున్నారన్నారు.గ‌త ప్రభుత్వం కొన్ని వర్గాలకే కొమ్ముకాసి రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిందని ఆరోపించారు. కేసీఆర్ అప్పు.. తెలంగాణ భ‌విష్య‌త్తుకు ముప్పుగా దాపురించిందన్నారు. కేసీఆర్ నిర్వాహకం వ‌ల్ల నెల‌కు 6 వేల కోట్ల ప్రజాధ‌నాన్ని అప్పల చెల్లింపుల కోసం మళ్లించాల్సి వ‌స్తుందన్నారు. స‌త్తా ఉన్న నాయ‌కుడు కేసీఆర్ అయితే.. ప‌త్తా లేకుండా ఎక్కడికి వెళ్లారని ప్రశ్నించారు. స‌త్తా ఉంటే అసెంబ్లీకి వ‌చ్చి సత్తా నిరూపించుకోవాలని మండిపడ్డారు.

READ MORE: Viral Video: కేవలం రూ. 500కే ఐదు బ్లౌజులు.. దుకాణం ముందు బారులు తీరిన మహిళలు!

ఉద్యోగుల పోరాటాన్ని వాడుకున్న చ‌రిత్ర బీఆర్ఎస్ ది అని మంత్రి సీతక్క ఆరోపించారు. 40 మంది ఆర్టీసీ కార్మికుల ఉసురు తీసింది మీరు కాదా? అని ప్రశ్నించారు. ఉపాద్యాయ‌, ఉద్యోగ నాయ‌కుల ఇంటి త‌లుపులు ప‌గుల గొట్టింది ఎవ‌రని అడిగారు. ఎంద‌రో ఉద్యమ‌కారుల‌ను అవ‌మాన ప‌రిచి బ‌య‌ట‌కు పంపిన చ‌రిత్ర తమదని బీఆర్ఎస్‌ నాయకులపై విమర్శలు గుప్పించారు. అప్పులు, అమ్మకాలు త‌ప్ప మీరు చేసిన‌ అభివృద్ది శూన్యమన్నారు. మీరు చేసిన అభివృద్ధి ఒక గాలి బుడ‌గ అని ఎన్నిక‌ల్లో ప్రజ‌లే తేల్చారని.. మీ అప్పుల మూలంగా ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఎదుర‌వుతున్నాయన్నారు. అయినా ఎక్కడా సంక్షేమానికి లోటు లేకుండా చూస్తున్నామని తెలిపారు.

READ MORE: CM Chandrababu: దేవాదాయ శాఖలో ఉద్యోగాల భర్తీకి సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్

Exit mobile version