Site icon NTV Telugu

Minister Seethakka : మహిళలను లక్షాధికారులు చేసేందుకు ప్లాన్.. 19 రకాల వ్యాపారాల గుర్తింపు

Minister Seethakka

Minister Seethakka

ప్రజలకు ఇచ్చిన హామీలను తమ ప్రభుత్వం నెరవేరుస్తుందని మంత్రి సీతక్క అన్నారు. రాష్ట్ర పంచాయతీరాజ్, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క.. జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండల కేంద్రంలో జరిగిన ప్రజా పాలన విజయోత్సవ సభలోకు హాజరైన మాట్లాడారు. గత ప్రభుత్వం చేసిన అప్పులకు వడ్డీలు కడుతున్నామన్నారు. మహిళలను లక్షధికారులను చేసేందుకు 19 రకాల వ్యాపారాలను గుర్తించినట్లు తెలిపారు. మహిళలు తయారు చేసిన వస్తువులను హైదరాబాద్ శిల్పారామంలో అమ్ముకునే ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.

READ MORE: India On Bangladesh: బంగ్లాదేశ్‌లో హిందూ సన్యాసి అరెస్టుపై భారత్ ఆందోళన..

ప్రభుత్వం ఏర్పడిన సంవత్సరంలో 53 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని మంత్రి తెలిపారు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని ఓర్వ లేక ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నాయని విమర్శించారు. అంతర్జాతీయ ప్రమాణాలుతో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ తెచ్చామని.. భూపాలపల్లి ములుగు రెండు కల్ల లాగ అభివృద్ధి చేస్తామన్నారు.
భూపాలపల్లి నియోజక వర్గానికి కావాల్సిన నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.

READ MORE: Nara Lokesh Praja Darbar: ప్రజా దర్భార్‌లో విజ్ఞప్తుల వెల్లువ.. పరిష్కారంపై మంత్రి లోకేష్‌ స్పెషల్ ఫోకస్‌..

Exit mobile version