NTV Telugu Site icon

Minister Seethakka: విధుల్లో ఎలాంటి అలసత్వం ఉండకూడదు.. టార్గెట్‌ రీచ్ కావాలి

Seethakka

Seethakka

హైదరాబాద్ మధురానగర్లోని మహిళా శిశు సంక్షేమ శాఖ కమిషనరేట్ కార్యాలయంలో జిల్లా సంక్షేమ అధికారులతో మంత్రి సీతక్క సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాల వారీగా మహిళా శిశు సంక్షేమ శాఖలో జరుగుతున్న అభివృద్ధి పురోగతిని, పని తీరును, పథకాల అమలును మంత్రి సమీక్షించారు. అంగన్వాడి కేంద్రాల సొంత భవనాల నిర్మాణం, టాయిలెట్ల నిర్మాణం, తాగునీటి కనెక్షన్లు త్వరగా పూర్తి చేయాలని మంత్రి సీతక్క తెలిపారు. పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖలకు తానే మంత్రిగా ఉన్నానని అన్నారు. దీంతో గ్రామ అభివృద్ధి నిధులను అంగన్వాడి కేంద్రాల నిర్మాణం కోసం వెచ్చించే అవకాశం దక్కిందని తెలిపారు. ఈ అవకాశాన్ని జిల్లా సంక్షేమ అధికారి సద్వినియోగం చేసుకోవాలని మంత్రి సీతక్క సూచించారు.

Thatikonda Rajaiah: అది నాలుకా, తాటి మట్టా.. కడియం వ్యాఖ్యలపై కౌంటర్

అంగన్వాడి కేంద్రాల్లో ఎలాంటి చిన్న పొరపాట్లు లేకుండా చూసుకోవాలి.. చిన్నారులే ఈ దేశ భవిష్యత్తు అని మంత్రి సీతక్క పేర్కొన్నారు. వారిని మంచి పౌరులుగా తీర్చి దిద్దే బాధ్యత అంగన్వాడి టీచర్లదేనన్నారు. అధికారులంతా తమ పనితీరును మెరుగుపరుచుకోవాలని తెలిపారు. విధుల్లో ఎలాంటి అలసత్వం ఉండకూడదు.. అధికారులంతా టార్గెట్‌ను రీచ్ కావాలని సూచించారు. త్వరలో జిల్లాలో పర్యటించి సమీక్షలు నిర్వహిస్తానని అన్నారు. సంక్షేమ శాఖలో డీడబ్ల్యూఓ (DWO)లే తమ కలెక్టర్లని తెలిపారు. జిల్లా సంక్షేమానికి మీరే బాసులున్నారు. సమాజంలో పేదలు అత్యంత బలహీనులకు సంక్షేమం అమలు చేసే అవకాశం మీకు దక్కింది.. వారందరినీ మీరు ఆదరించాలని చెప్పారు.

Gun Firing: ముంబైలో విచక్షణారహితంగా కాల్పులు.. ఒకరికి గాయాలు

జిల్లా అధికారులు క్షేత్రస్థాయి పర్యటనలు పెంచాలి.. అంగన్వాడి కేంద్రాల్లో పోషకాహారం చెక్ చేయాలని మంత్రి సూచించారు. నాసిరకం వస్తువులు వస్తే వెంటనే రిజెక్ట్ చేసి సప్లయర్ పై చర్యలు తీసుకోవాలని అన్నారు. పిల్లలలో పోషకాహార లోపాన్ని అధిగమించేలా పనిచేయాలి.. పోషకాహారాన్ని మెరుగుపరిచేందుకు తీసుకోవాల్సిన అభిప్రాయాలను తెలియజేయాలని అన్నారు. బడిబాట తరహాలో ప్రజాప్రతినిధులు, అధికారులు అంగన్వాడి బాట చేపట్టాలిని తెలిపారు. అధికారులంతా సమయపాలన పాటించి జిల్లా సంక్షేమాన్ని నిత్యం పర్యవేక్షించాలని మంత్రి సీతక్క పేర్కొన్నారు.

Show comments