Site icon NTV Telugu

Minister Seethakka: సంచార చేపల విక్రయ వాహనాలను ప్రారంభించిన మంత్రి..

Seethakka

Seethakka

హైదరాబాద్ ప్రజాభవన్‌లో మంత్రి సీతక్క జెండా ఊపి 25 సంచార చేపల విక్రయ వాహనాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. భార్యభర్తలు రోజంతా పనిచేసినా.. సాయంత్రం భార్య మాత్రమే ఇంట్లో పని ఎందుకు చేయాలి.. ఇద్దరూ చేయాల్సిందేనని అన్నారు. మహిళా సంఘాలకు లోన్ భీమా పథకాన్ని అమలు చేస్తున్నామని మంత్రి తెలిపారు. 17 రకాల వ్యాపారాలతో మహిళలకు ఉపాధి కల్పిస్తున్నాం.. నాణ్యత, మంచి రుచితో ఆరోగ్యకరమైన చేపల వంటకాలు తయారు చేయండని సూచించారు. ఫిష్ ఫుడ్ కు మంచి బ్రాండ్ క్రియేట్ కావాలి.. 100 సక్సెస్ రేట్ ఉండాలని అన్నారు. అమ్మ చేతి వంటకు మారుపేరుగా ఇందిరా మహిళా క్యాంటీన్లు ఉండాలి మంత్రి సీతక్క తెలిపారు. సంచార చేపల విక్రయ వాహనాల్లో వ్యాపారాలు విజయవంతం కావాలి.. మండల కేంద్రం వరకు ఈ వ్యాపారం వెళ్ళాలని సూచించారు.

Read Also: Madhavilatha: మాధవీలతపై టీడీపీ కౌన్సిలర్ల ఫిర్యాదు

సావిత్రి భాయి ఫూలే జయంతి సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. దేశంలో మొదటి సారి సావిత్రి భాయి ఫూలే జయంతిని అధికారికంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. కాంగ్రెస్ లక్ష్యం సామాన్య మహిళలను కోటీశ్వరులను చేయడమని అన్నారు. ఆడవాళ్లకు చదువు అవసరం లేదనే మూఢనమ్మకాల నుంచి ఇప్పడిప్పుడే బయటపడ్డాం.. మహిళ ఇంటికే పరిమితం కాదని సావిత్రి భాయి ఫూలే నిరూపించారన్నారు. చదువు గొప్పతనాన్ని ప్రపంచానికి చాటిన గొప్ప వ్యక్తి సావిత్రి భాయి ఫూలేనని కొనియాడారు. ఆదివాసీ బిడ్డ రాష్టప్రతిగా ఉన్నారని మంత్రి సీతక్క పేర్కొన్నారు.

Read Also: Tollywood: ప్రయోగాలొద్దమ్మా.. కమర్షియల్ సినిమాలే కావాలి!

Exit mobile version