Minister Seethakka: నిర్మల్ జిల్లా దిలావర్‌పూర్ ఇథనాల్ ఫ్యాక్టరీ అంశంపై మంత్రి సీతక్క సంచలన వ్యాఖ్యలు చేశారు. అబద్ధాల పునాదులతో అధికారంలోకి రావాలని బీఆర్ఎస్ ప్రయత్నం చేస్తోందన్నారు. దిలావర్ పూర్-గుండంపల్లి మధ్యలో ఇథనాల్ ఫ్యాక్టరీపై కుట్ర జరుగుతోందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలోనే ఇథనాల్ ఫ్యాక్టరీకి అన్ని రకాల అనుమతులు వచ్చాయని చెప్పారు. మా ప్రభుత్వం వచ్చాక మేము ఎటువంటి పక్రియ చేపట్టలేదని.. అయినా మా ప్రభుత్వంపై కుట్ర చేస్తున్నారన్నారు. దొంగ నాటకాలు , రెచ్చగొట్టడం బీఆర్ఎస్‌కు అలవాటు అయిందని మండిపడ్డారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఫ్యాక్టరీలు వస్తే గొప్పగా చెప్పుకున్నారు కదా అంటూ వ్యాఖ్యనించారు. ఇథనాల్ ఫ్యాక్టరీకి బీఆర్ఎస్, బీజేపీలు అనుమతులు ఇచ్చింది వాస్తవం కాదా అంటూ ప్రశ్నించారు.
Read Also: Minister Ponnam Prabhakar: కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో మంత్రి పొన్నం ప్రభాకర్ భేటీ
ఇథనాల్ ఫ్యాక్టరీలో డైరెక్టర్లుగా బీఆర్ఎస్ నేతలు అయిన తలసాని సాయికిరణ్, మరో వ్యక్తి ఉన్నారన్నారు. ఆందోళన చేస్తున్న రైతులతో మాట్లాడేందుకు వెళ్లిన ఆర్డీవోపై బీఆర్ఎస్, బీజేపీకి చెందిన వ్యక్తులు దాడులు చేశారన్నారు. సోషల్ మీడియాలో ఇష్టారీతిలో విషం వెదజల్లుతున్నారని.. తలసాని సాయికిరణ్ ఎవరో బీఆర్ఎస్ చెప్పాలన్నారు. ఇథనాల్ ఫ్యాక్టరీకి భూములు ఇచ్చిన వారిలో బీజేపీ నేత ఉన్నారన్నారు. ఉచిత బస్సు సౌకర్యం ఇస్తే బీఆర్ఎస్ విమర్శలు , ఉద్యోగాలు ఇస్తామంటే బీఆర్ఎస్ ఆందోళనలు.. ఇంత దారుణమా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సిరిసిల్ల కలెక్టర్‌పై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు అత్యంత దారుణమన్నారు.మల్లన్న సాగర్, కొండపోచమ్మ భూ నిర్వాసితులకు బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన న్యాయం ఏంటి అని ప్రశ్నించారు. కిరాయి మనుషులతో సోషల్ మీడియాలో విష ప్రచారం చేస్తున్నారని, కేసులు పెడితే తప్పా అంటూ వ్యాఖ్యానించారు. ఇథనాల్ ఫ్యాక్టరీలో తలసాని పాత్రపై కేటీఆర్ సమాధానం చెప్పాలన్నారు. నిర్మల్ ప్రజలకు కేటీఆర్ క్షమాపణ చెప్పాలన్నారు. అప్పుడు అన్ని అనుమతులు ఇచ్చి ఇప్పుడు అబద్ధాలు ఆడుతున్న కేటీఆర్ ముక్కు నేలకు రాయాలన్నారు. మా ప్రభుత్వం ఇథనాల్ ఫ్యాక్టరీ పనులు ఆపించిందన్నారు. ఫౌంహౌస్‌ల పాలన చేసిన మీకు మా గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ నేతలకు దమ్ముంటే ఇథనాల్ ఫ్యాక్టరీకి మేము పర్మిషన్ ఇవ్వలేదని చెప్పగలరా అంటూ ప్రశ్నించారు.
Read Also: Minister Thummala: రైతులకు గుడ్ న్యూస్.. పాలమూరు సభ ద్వారా రూ.3వేల కోట్ల రుణమాఫీ!
నిర్మల్ జిల్లా దిలావర్‌పూర్ ఇథనాల్ కంపెనీకి సంబంధించిన అసలైన వాస్తవాలు ఇవిగో అంటూ మంత్రి సీతక్క వివరించారు. కేసీఆర్, కేటీఆరే ఇథనాల్ కంపెనీలో అసలు దోషులు అని ఆరోపించారు. వాళ్లే అక్కడ ఇథనాల్ ఫ్యాక్టరీ పెట్టేందుకు అనుమతులు జారీ చేశారన్నారు. అక్కడ ఫ్యాక్టరీ పెట్టి కంపెనీ బీఆర్ఎస్ మంత్రిగా పని చేసిన తలసాని శ్రీనివాస్ యాదవ్‌దేనన్నారు. అక్కడి ఫ్యాక్టరీ ఏర్పాటు చేయించి.. రైతులను ముంచే ఆలోచనలు చేసిందే బీఆర్ఎస్ ప్రభుత్వమన్నారు. ఇప్పుడు అక్కడి రైతులను అధికారులపై రెచ్చగొట్టి ప్రజా ప్రభుత్వంపై కుట్రలు చేస్తున్నది కూడా కేసీఆరే అంటూ విమర్శించారు. అక్కడ ఇథనాల్ కంపెనీ ఏర్పాటుకు నీళ్లు, కరెంట్, పొల్యూషన్ అన్ని అనుమతులు ఇచ్చింది.. ఆమోదం తెలిపింది గత బీఆర్‌ఎస్ ప్రభుత్వమేనన్నారు. అక్కడ ఇథనాల్ కంపెనీ ఏర్పాటు చేస్తున్నది పీఎంకే డిస్టిలేషన్ కంపెనీ అని.. ఇందులో అప్పటి మంత్రి తలసాని కుటుంబమే కీలకమన్నారు. ఆయన కుమారుడే అందులో డైరెక్టర్గా ఉన్నారన్నారు. తలసాని శ్రీనివాస్ యాదవ్ కొడుకు తలసాని సాయి కిరణ్, తలసాని అల్లునికి కుటుంబానిదే ఈ కంపెనీ అని.. కేసీఆర్, కేటీఆర్ కలిసి తన మంత్రివర్గంలో చర్చించి ఈ కంపెనీకి ఆమోదం తెలిపారని మంత్రి సీతక్క పేర్కొన్నారు.