Telangana Jobs: తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త.. త్వరలోనే 50 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో ఉద్యోగాల భర్తీ, నిరుద్యోగ సమస్యలపై రాజకీయ సెగలు రాజుకుంటూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై మంత్రి సీతక్క తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పదేళ్ల నిరంకుశ పాలనలో బీఆర్ఎస్ పార్టీ నిరుద్యోగులను నిలువునా ముంచిందని, యువత జీవితాలతో ఆడుకుందని ఆమె ఆరోపించారు. ఒకప్పుడు నీళ్లు, నిధులు, నియామకాల నినాదంతో ఏర్పడిన రాష్ట్రంలో, గత ప్రభుత్వం కేవలం స్వలాభం కోసమే పనిచేసిందని విమర్శించారు. పదేళ్ల సుదీర్ఘ కాలంలో బీఆర్ఎస్ కనీసం లక్ష ఉద్యోగాలను కూడా భర్తీ చేయలేకపోయిందని, నోటిఫికేషన్ల పేరిట కాలయాపన చేస్తూ నిరుద్యోగుల ఆశలపై నీళ్లు చల్లిందని మండిపడ్డారు. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న ఉపాధి అవకాశాలను కూడా తెలంగాణ సిద్ధించిన తర్వాత యువతకు దక్కకుండా చేశారని దుయ్యబట్టారు.
అయితే.. తమ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నిరుద్యోగుల సంక్షేమానికే ప్రథమ ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. కేవలం కొద్ది నెలల వ్యవధిలోనే పారదర్శకంగా, ఎక్కడా కోర్టు వివాదాలు లేకుండా ఇప్పటికే 70 వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసి నిరుద్యోగుల ఇళ్లలో వెలుగులు నింపామని ఆమె వెల్లడించారు. ఇచ్చిన మాట ప్రకారం యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.
Also Read
- UK: బ్రిటన్ ప్రధానిగా ఆండీ బర్న్‌హామ్.. సోమవారం బాధ్యతలు స్వీకరణ
- Ponnam Prabhakar: అలాంటి వాహనాలను సీజ్ చేయండి.. మంత్రి పొన్నం ప్రభాకర్ సీరియస్ వార్నింగ్..
- Sonam Wangchuk: సోనం వాంగ్‌చుక్ దీక్షలో నవ్వులు.. పువ్వులు.. ఏం జరిగిందంటే..!
- Gambhir-Kohli: గంభీర్-కోహ్లీ మధ్య ‘కోల్డ్ వార్’.. తొలి సారి నోరు విప్పిన టీమిండియా కోచ్!
భవిష్యత్తులో కూడా ఉద్యోగాల భర్తీ ప్రక్రియ నిరంతరాయంగా కొనసాగుతుందని, దీనిలో భాగంగానే త్వరలోనే మరో 50 వేల ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన సరికొత్త నోటిఫికేషన్లను విడుదల చేయడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోందని ప్రకటించారు. నిరుద్యోగులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అర్హులైన ప్రతి ఒక్కరికీ న్యాయం జరిగేలా ప్రణాళికాబద్ధంగా ఉద్యోగాల విప్లవాన్ని ముందుకు తీసుకెళ్తామని మంత్రి సీతక్క భరోసా ఇచ్చారు. ప్రతిపక్షాల అసత్య ప్రచారాలను నిరుద్యోగ యువత నమ్మవద్దని, ప్రభుత్వంపై నమ్మకంతో పోటీ పరీక్షలకు సిద్ధం కావాలని ఆమె పిలుపునిచ్చారు.
తాజావార్తలు
-
UK: బ్రిటన్ ప్రధానిగా ఆండీ బర్న్‌హామ్.. సోమవారం బాధ్యతలు స్వీకరణ
-
Ponnam Prabhakar: అలాంటి వాహనాలను సీజ్ చేయండి.. మంత్రి పొన్నం ప్రభాకర్ సీరియస్ వార్నింగ్..
-
Sonam Wangchuk: సోనం వాంగ్‌చుక్ దీక్షలో నవ్వులు.. పువ్వులు.. ఏం జరిగిందంటే..!
-
Gambhir-Kohli: గంభీర్-కోహ్లీ మధ్య ‘కోల్డ్ వార్’.. తొలి సారి నోరు విప్పిన టీమిండియా కోచ్!
-
Pakistan: పాక్‌లో 5వ రాష్ట్రంగా గిల్గిట్-బాల్టిస్తాన్.. భారత్‌ను కవ్వించే చర్య..
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్‌లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?